Bengaluru Floods: బెంగళూరు వరదలకు కారణం ఆక్రమణలే, తప్పు ఒప్పుకుంటున్న బిల్డర్‌లు
Bengaluru Floods: బెంగళూీరు వరదలకు అక్రమ నిర్మాణాలేనని ప్రాథమికంగా నిర్ధరించారు.
Bengaluru Floods:
బడా టెక్ కంపెనీలూ కారణమే..
బెంగళూరులో భారీ వర్షాలు ఎంత ఇబ్బందులకు గురి చేశాయో కళ్లారా చూశాం. నగరంలో కీలకమైన ప్రాంతాలన్నీ నీట మునిగాయి. బిలియనీర్ల ఇళ్లకూ వరద తాకిడి తప్పలేదు. అయితే...ఈ వరదలకు కారణం...ఆక్రమణలే అని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఆక్రమణలు చేసిన వాళ్లలో బడా టెక్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ ఆక్రమణల ఫలితంగా...దాదాపు 780 వర్షపు నీటి కాలువలు మూసుకుపోయాయి. ఫలితంగానే...ఈ స్థాయిలో వరదలు వచ్చినట్టు అధికారులు నిర్ధరించారు. ఈ టెక్ కంపెనీల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. విప్రో, ప్రెస్టేజ్, ఈకో స్పేస్, బాగ్‌మనే టెక్ పార్క్, కొలంబియా ఆసియా హాస్పిటల్, దివ్యశ్రీ విల్లాస్ ఈ జాబితాలో ఉన్నాయి. బడా వ్యక్తులైనప్పటికీ...చర్యలు తప్పకుండా తీసుకుంటామని చాలా స్పష్టంగా చెబుతున్నారు అధికారులు. ఈస్ట్ బెంగళూరులో ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలను కూల్చివేసే పని మొదలైంది. నాలాపడ్‌లోని కాంగ్రెస్ నేతకు చెందిన ఓ స్కూల్‌ని కూడా కూల్చివేశారు.
అవును ఆక్రమించాం..
ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు..తాము అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టు అంగీకరించాయి. ఓ టెక్ పార్క్ తన తప్పుని ఒప్పుకున్నప్పటికీ...ఆ తప్పంతా బిల్డర్‌పై తోసేసింది. పూర్వాంకర బిల్డర్ వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించింది. బాగ్‌మనే వరల్డ్ టెక్నాలజీ సెంటర్ ( Bagmane World Technology Centre) కూడా ఈ లిస్ట్‌లో ఉంది.. సిటీలోని ఎంతో ఫేమస్ అయిన Bagmane గ్రూప్ దీన్ని నిర్మించింది. ఐటీ కారిడార్‌లో ఉన్న ఈ సెంటర్...తీవ్రంగా వరదల ప్రభావానికి గురైంది. ఈ టెక్‌పార్క్‌లో బోయింగ్, అసెంచర్, EY, డెల్, ఎరిక్సాన్ లాంటి కంపెనీలున్నాయి.
ఈ వరదలకు ప్రధాన కారణం...Puravankara Parkridge Villas అని అధికారులు తేల్చి చెబుతున్నారు. Puravankara Parkridge మొత్తం 149 విల్లాలు నిర్మించింది. వీటిలో చాలా వరకూ ఆక్రమణలు చేసి నిర్మించినవే. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఇప్పటికే సర్వే చేపట్టి...ఆక్రమణల లెక్క తేల్చింది. అయితే...అక్కడి రెసిడెంట్స్ మాత్రం దీన్ని వ్యతిరేకించారు. సర్వే తమ సమక్షంలో జరగలేదని
ఆరోపించారు. ఈ కారణంగానే...మరోసారి సర్వే చేపట్టారు. ఇవి అక్రమ నిర్మాణాలను అప్పుడే తేలింది. దీనిపై కోర్టుకు వెళతామని స్థానికులు అంటున్నారు. మొత్తానికి...ఆక్రమణల కారణంగా..సిటీలు నీట మునిగిపోతున్నాయనటానికి బెంగళూరు ప్రత్యక్ష ఉదాహరణ.
నీట మునిగిన బిలియనీర్ల విల్లాలు..
ఎప్పుడు వరదలు వచ్చినా...మిలియనీర్లకు, బిలియనీర్లకు ఏమీ కాదు. కష్టాలన్నీ మిగతా వర్గాలివే అనుకుంటారు. కానీ...ఈ సారి వరదలకు బెంగళూరులోని బిలియనీర్లనూ ఇబ్బంది పెడుతోంది. రిచెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అయిన Epsilonనూ వరద చుట్టుముట్టింది. ఎంతో మంది ధనికులు ఈ కమ్యూనిటీలోనే ఉంటారు. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ, బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ, బిగ్‌బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి, బైజూస్ కో ఫౌండర్ బైజు రవీంద్రన్..ఇలా ఎందరో. వీళ్లందరూ ఇప్పుడు తమ ఇళ్లలోనే ఉండలేని పరిస్థతి వచ్చింది. ఇళ్లన్నీ జలమయమయ్యాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కో విల్లా విలువ రూ.10 కోట్లు. ఇంత కాస్ట్‌లీ భవంతులూ వరద తాకిడికి తడిసి ముద్దైపోయాయి. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. లగ్జరీ కార్లు నీటిలో మునిగిపోయాయి.
Also Read: TS Power : బీజేపీకి "కరెంట్" షాకిచ్చే వ్యూహం - విద్యుత్ చట్టమే కేసీఆర్ అస్త్రం !