Uber Ride: ఊబర్ రైడ్ బుక్ చేసుకున్నాడు, వెయిటింగ్ టైమ్ చూసి కళ్లు తేలేశాడు
Uber Ride: బెంగళూరులో ఓ వ్యక్తి ఊబర్ రైడ్ వెయిటింగ్ టైమ్ చూసి షాక్ అయ్యాడు.
Uber Ride Waiting Time:
బెంగళూరులో అంతే మరి..
ట్రాఫిక్ జామ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తొచ్చే సిటీ బెంగళూరు. అక్కడి వాళ్లు రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో ట్రాఫిక్‌కి సంబంధించి ఏదో ఓ పోస్ట్ పెడుతూనే ఉంటారు. ఇప్పటికే అక్కడి రద్దీతో విసిగిపోయారు. కొంత మంది బెంగళూరు ట్రాఫిక్‌పై మీమ్స్ కూడా చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బెంగళూరు వాసి ట్విటర్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఊబర్‌లో ఆటో బుక్ చేసుకున్న ఆ వ్యక్తి వెయిటింగ్ టైమ్ చూసి కళ్లు తేలేశాడు. అదే స్క్రీన్‌షాట్‌ని ట్వీట్ చేశాడు. 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఆటో రావడానికి వెయిటింగ్ టైమ్ 71 నిముషాలు చూపించింది. ఇది చూశాకే ఆ యూర్ షాక్ అయ్యాడు. "అంత దూరం నుంచి శ్రమపడి వస్తే మాత్రం..ఆ ఆటో డ్రైవర్‌కి కచ్చితంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే" అంటూ ఓ కొటేషన్ రాసి పోస్ట్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ట్విటర్ యూజర్స్ ఇది చూసి ఆశ్చర్యపోయారు. అందుకే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని మొత్తుకునేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "అన్ని కంపెనీల HRలకు ఈ స్క్రీన్ షాట్ పంపించాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎంత బెటరో వాళ్లకు అర్థమైపోతుంది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "నాకు తెలిసినంత వరకూ మనం సిటీలు వదిలేసి పల్లెటూళ్లకు మూవ్ అయిపోవటం మంచిది. టైమ్ వేస్ట్ అవ్వదు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రశాంతంగా బతకొచ్చు. MNCలు ఉద్యోగుల కన్వీనియెన్స్ కోసం అలాంటి ఏర్పాట్లు చేయాలి" అని మరో నెటిజన్ సలహాలిచ్చాడు. అయితే...ఈ రైడ్‌ని యాక్సెప్ట్ చేసిన కాసేపటికే ఆ డ్రైవర్ వెయిటింగ్ టైమ్‌ని, దూరాన్ని చూసి వెంటనే ఓ నిముషం తరవాత క్యాన్సిల్ చేశాడు.
Huge respect for him if he actually shows up. #peakbengaluru pic.twitter.com/6rQt1TswPU
— Anushank Jain (@madmax_anushank) May 16, 2023
Lol you seem to be the chosen one!
— Gautham Shanbhogue 🇮🇳 (@ohmygaut) May 17, 2023
I thought @Olacabs & @Uber_India autos were just for the ads. If you need one urgently, none of them accept or arrive for the pickup - although in the app they show a pile of autos just 1 min away!
ఓలా, ర్యాపిడో,ఊబర్‌తో చాలా మంది డ్రైవర్లు టైఅప్ అవుతున్నారు. ఒక్కొక్కరూ రెండు మూడు కంపెనీలకు సర్వీస్‌లు అందిస్తున్నారు. ఒక కంపెనీ రైడ్‌ను పూర్తి చేసిన వెంటనే..మరో కంపెనీకి సంబంధించిన రైడ్‌ను తీసుకుంటున్నారు. సాధారణంగా ఏ వెహికిల్‌ని అయినా క్యాబ్ కంపెనీలతో టై అప్ చేసినప్పుడు వెహికిల్ నంబర్ రిజిస్టర్ అయిపోతుంది. కానీ కొందరు రకరకాల నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. బెంగళూరులో ఓ ఆటో వెనక మూడు రిజిస్ట్రేషన్ నంబర్లు కనిపించింది. ఓ వ్యక్తి ఈ ఆటోను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయింది. అసలు ఒక్క వాహనానికి ఇలా మూడు నంబర్లు వేరువేరుగా ఉండొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. ఆటోకి ఎల్లో నంబర్ ప్లేట్ ఉంది. ఆ డ్రైవర్ మాత్రం ఓలా, ర్యాపిడోకి వేరు వేరు నంబర్లు ఉన్నాయంటూ ఓ స్టికర్ అంటించుకున్నాడు. ఇదే హాట్ టాపిక్‌గా మారింది. "ఇన్ని రిజిస్ట్రేషన్లా" అంటూ ఓ నెటిజన్ ఈ ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఓలా, ర్యాపిడోకి టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్లు అటాచ్ చేశాడు డ్రైవర్. దీనిపై ట్విటర్‌లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది.
Another #PeakBangalore moment in E-city. How many registrations is too many registrations? @peakbengaluru pic.twitter.com/SaW9hMKBQV
— suprit j (@jadhav_suprit96) April 5, 2023
Also Read: Elon Musk: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై మస్క్ అసహనం, ఊహల్లో తేలుతున్నారంటూ సెటైర్లు