News
News
X

Semi Bullet Train : హైదరాబాద్ - బెంగళూరు మధ్య సెమీ హైస్పీడ్ రైలు - ఎన్ని గంటల్లో వెళ్లొచ్చంటే ?

హైదరాబాద్ - బెంగళూరు మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందు కోసం సన్నాహాలు ప్రారంభించింది.

FOLLOW US: 

Semi Bullet Train :  హైదరాబాద్ - బెంగళూరు మధ్య రైల్లో ప్రయాణం చేయాలంటే పది గంటలు ఖాయంగా పడుతుంది. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని రెండున్నర గంటల పాటు తగ్గించి.. ఏడున్నర గంటల్లోనే బెంగళూరు చేరుకునేలా సెమీ హైస్పీడ్ రైళ్లను సిద్ధం చేస్తున్నారు. బెంగళూరు - హైదరాబాద్ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ట్రైన్స్ ఎప్పుడూ వెయిటింగ్ లిస్టులోనే ఉంటాయి. అయితే..  ప్రయాణ సమయం ఎక్కువని.. రైళ్లు మరింత వేగంగా ఉంటే బాగుంటందనే సూచనలు రైల్వేలకు చాలా కాలంగా ఉన్నాయి. 

సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం రైల్వే సన్నాహాలు

ఇటీవలి కాలంలో రైళ్ల వేగాన్ని పెంచుతున్న రైల్వే శాఖ .. రూ. ముఫ్పై వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. రైళ్ల వేగాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకల సమయాన్ని కూడా తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం ప్రాథమిక సన్నాహాలను పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. 

"మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్‌ల నిర్మాణం

ప్రస్తుతం రైళ్లు గంటకు వంద కిలోమీటర్లకు అటూ ఇటూగా వేగంతో పయనిస్తూ ఉంటాయి. ఇప్పుడు కనీసం రెండు వందల కిలోమీటర్ల వేగంతో  రైళ్లు పయనించేలా సెమీ హైస్పీడ్ రైళ్లు ఉండనున్నాయి. ఇలా చేయడం వల్ల ..  బెంగళూరు- హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం కనీసం రెండున్నర గంటల పాటు తగ్గిపోతుదంని అంచనా వేస్తున్నారు. హైస్పీడ్ ట్రైన్ ట్రాక్..  బెంగళూరు శివారులోని యలహంక నుంచి సికింద్రాబాద్ వరకూ ఉండే అవకాశం ఉంది. ఇది మొత్తం ఐదు వందల కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండనుంది. 

పార్లమెంటరీ బోర్డులోకి లక్ష్మణ్ - గడ్కరీ, చౌహాన్‌లకు నిరాశ ! బీజేపీ కీలక కమిటీల్లో మార్పులు

బుల్లెట్ ట్రైన్స్ సహా పలు  అంశాల్లో రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు 

కేంద్రం రైల్వేలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావాలని ప్రయత్నిస్తోంది.  బుల్లెట్ ట్రైన్స్‌ను ప్రవేశ పెట్టాలని ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అహ్మదాబాద్ - ముంబై మధ్య ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. మరికొన్ని బుల్లెట్ ట్రైన్ రూట్లపై పరిశీలన జరుపుతున్నారు. అదే సమయంలో హైస్పీడ్, సెమీ హైస్పీడ్ రైళ్ల ను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కొన్ని రూట్లలో ట్రైన్ల వేగాన్ని పెంచారు. ఇప్పుడు సెమీ హైస్పీడ్ రైళ్ల ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  అయితే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు  ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో ఇంకా స్పష్టత లేదు.  వీలైనంత వేగంగా గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో రైల్వే శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. 

Published at : 17 Aug 2022 04:32 PM (IST) Tags: Railway Department Semi High Speed ​​Trains Hyderabad to Bangalore

సంబంధిత కథనాలు

Minister KTR : పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదు, ప్రజల ప్రశంసలు దక్కడం సవాలే- మంత్రి కేటీఆర్

Minister KTR : పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదు, ప్రజల ప్రశంసలు దక్కడం సవాలే- మంత్రి కేటీఆర్

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Nellore Crime : కానిస్టేబుల్ తో ఎస్ఐ ప్రేమపెళ్లి, అదనపుకట్నం కోసం వేధింపులు

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Kotakonda Durgamma : శ్రీకాకుళం జిల్లాలో దొరల దసరా, వేపచెట్టు వద్ద తురాయి పువ్వు ఎటుపడితే అటు సుభిక్షం!

Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- 10 మంది మృతి!

Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లో మంచు తుపాను- 10 మంది మృతి!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

టాప్ స్టోరీస్

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !