Viral Girl: దుబాయ్ స్టేడియంలో మెరిసిన ఈ సుందరి ఎవరో తెలిసిపోయింది - సోషల్ మీడియా మరో సూపర్ స్టార్‌ను కనిపెట్టేసిందా ?
Viral Girl: చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం తర్వాత అందరికీ గుర్తున్న అంశం ఒక్కటే. ఆ అంశం ఓ అమ్మాయి. కెమెరామెన్ పుణ్యమా అని ఇప్పుడా సుందరి హాట్ టాపిక్ అయింది.

Beautiful Viral Girl : దుబాయ్ స్టేడియంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫి సెమీస్ లో ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. ఆ విజయాన్ని చర్చించుకున్న తర్వాత అందరూ ఇంతకూ ఆ అందమైన అమ్మాయి ఎవరు అని వెదకడం ప్రారంభించారు. ఏ అమ్మాయి అంటే..స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ చూస్తూ సందడి చేసిన అమ్మాయి. కెమెరామెన్ ఆ బ్యూటీని హైలెట్ చేశారు. అంతే.. సోషల్ మీడియా అంతా ఇంతకీ ఎవరా బ్యూటీ అని వెదకడం ప్రారంభించారు.
32వ ఓవర్‌లో స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కెమెరా ఆమె వైపు ఫోకస్ చేసింది. అంతే ఆ ఒక్క క్లిప్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఎవరో తెలుసుకోవాలని సెర్చ్ చేయడం ప్రారంభఇంచారు. ఆమెను గుర్తించడంలో నెటిజన్ల సహాయం కోరుతూ చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆ అమ్మాయిని కలిగి ఉన్న ఒక చిన్న క్లిప్‌ను షేర్ చేశారు.
Aur ache se dekho Bhai she’s Payal Gaming #INDvsAUS https://t.co/uR0XE47QRG pic.twitter.com/06dCJCglSC
— @Colonel_Kickass (@sudeeptraj) March 4, 2025
సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆమె ఎవరో తెలియకుండా ఉంటుందా...? ఆమె పేరు పాయల్, స్పోర్ట్స్ లవర్.ఆన్ లైన్ గేములు కూడా ఆడుతూంటారు. "పాయల్ గేమింగ్" ఆమె యూజర్ నేమ్ అని కొంత మంది షేర్ చేశారు.
Spotted at the stadium! 👀🏏
— Trend Tracker (@trendtracker_x) March 4, 2025
Payal Gaming, @8bit_thug, and @jokerkihaveli enjoying the electrifying #IndvsAus clash at #ChampionsTrophy2025! 🔥
Who else is watching this epic battle? 🏆⚡ pic.twitter.com/NrrkqQPXke
మ్యాచ్ స్క్రీన్ నుండి కొన్ని సెకన్లు తీసి, X యూజర్లు పాయల్ వీడియోలు , ఫోటోలను పోస్ట్ చేసి, "వో సబ్ తో థీక్ హై పర్ యే హై కోన్ ?" అని అడిగడం ప్రారంభించారు. మ్యాచ్ అప్‌డేట్‌లతో పాటు, మార్చి 4న జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ మ్యాచ్ నుండి ఈ వైరల్ అమ్మాయిని గుర్తించడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేశారు.
fan favourite streamer of the year ( female ) ❤️🧿 thank you everyone pic.twitter.com/SBU7jNWaav
— Payal Gaming (@Payal_Dhaare) September 19, 2022
పాయల్ గేమింగ్ అలియా పాయల్ ధారే కు యూట్యూబ్‌లో నాలుగు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. గేమర్, స్ట్రీమర్ , కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింంపు పొందారు. మధ్యప్రదేశ్ కు చెందిన పాయల్ అవార్డు గెలుచుకున్న గేమర్‌గా గుర్తింపు పొందారు. ఆమె దేశంలోని ప్రముఖ మహిళా గేమర్‌లలో ఒకరని చెబుతారు. ఆమె S8UL ఎస్పోర్ట్స్‌లో స్ట్రీమర్, ముఖ్యంగా ఆమె బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) వీడియోలకు ప్రసిద్ధి చెందినట్లుగా చెబుతునన్నారు.
2023లో ఆమె మాజీ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను కలిసిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఆ వీడియోను రెండు లక్షల మంది చూశారు. వైరల్ అయిన ఈ అమ్మాయి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. గత సంవత్సరం, పాయల్ ప్రధాని మోదీ కంటెంట్ క్రియేటర్లను కలిసిన టీమ్‌లో ఉన్నారు. అంటే.. ఆమె సోషల్ మీడియాలో కొత్తగా వైరల్ కాలేదు. కంటెంట్ క్రియేటర్లలో ఆమె ఇప్పటికే స్టార్ అన్నమాట.





















