Bangkok: రేయ్.. రేయ్.. ఇదేం పనిరా.. అది కరోనా ఆసుపత్రా లేక ఇంకేమైనానా?
ఓ కొవిడ్ ఆసుపత్రిలో రోగుల తీరు చూసి అధికారులు, సిబ్బంది షాకయ్యారు. భౌతిక దూరం పాటించాల్సిన చోట వారంతా సెక్స్ లో పాల్గొనడం చూసి సిబ్బంది మైండ్ బ్లాక్ అయింది. బ్యాంకాక్ లో ఈ ఘటన జరిగింది.
కొవిడ్ ఆసుపత్రి.. ఈ పేరు వింటేనా ప్రస్తుతం జనాలు భయపడుతున్నారు. మన టైం బాగోక కరోనా బారిన పడి ఆసుపత్రికి వెళ్తే ఎప్పుడు నయమై డిశ్చార్జి అవుతామో అని ఎదురుచూస్తుంటాం. భౌతిక దూరం, మాస్కులు పెట్టుకోవడం.. ఇవన్నీ కొవిడ్ ఆసుపత్రిలో తప్పనిసరి. అయితే ఆ ఆసుపత్రిలో పరిస్థితులు చూస్తే షాక్ అవుతారు.
నిర్లక్ష్యంగా వైద్యం చేయడం, పేషెంట్లను సరిగా పట్టించుకోకపోవడం అన్ని ఆసుపత్రుల్లో సర్వసాధారణం కానీ దీనికి మరో వ్యాధి తోడైందట.
విచ్చలవిడి శృంగారం, సినిమా స్టైల్ ఫైట్లు, డ్రగ్స్ వినియోగం.. ఇవన్నీ ఆ ఆసుపత్రిలో సర్వసాధారణమట. అందులోనూ అది కొవిడ్ ఆసుపత్రి. వినడానికి నమ్మశక్యంగా లేదా? అయితే ఇది జరిగిందని భారత్ లో కాదు.. బ్యాంకాక్ లోని సాముత్ ప్రాకన్ రాష్ట్రంలోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో.
ALSO READ:అవనికి ప్రత్యేక SUV వాహనం... ప్రకటించిన ఆనంద్ మహీంద్ర
1000 మంది రోగులు..
మొత్తం 5 భవనాల్లో 1000 మంది రోగులను ఉంచి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ వైద్యం మాట దేవుడు ఎరుగు. కరోనా సంగతేమోగానీ రోగులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారన్నమాట.
కరోనా చికిత్స కోసం ఈ ఆసుపత్రిలో జాయిన్ అయిన కొంతమంది రోగులు మాత్రం ఆసుపత్రిలో రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా శృంగారం చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్నారు. ఈ సంగతి అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ విజువల్స్‌ను ఆసుపత్రి సిబ్బంది చూసి షాకయ్యారట. అంతేకాకుండా గ్రూపులుగా విడిపోయి సినిమా స్టైల్ లో ఫైటింగ్ లు కూడా దిగుతున్నారు.
ALSO READ:కన్యత్వాన్ని తిరిగి పొందవచ్చా? వర్జినిటీ రిపేర్ పేరుతో వైద్యులు ఏం చేస్తున్నారు?
అయితే ఇవన్నీ చూసిన అధికారులు.. తలలు పట్టుకున్నారు. ఇక లాభం లేదని ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రిలో పురుషులు, మహిళలను విభజించి ప్రత్యేక ప్రదేశాల్లో ఉంచారట. ఇలాంటి పనులు చేస్తే వేరే ఆసుపత్రికి తరలిస్తామని అధికారులు హెచ్చరించారు.
ALSO READ: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆసుపత్రికి వచ్చి అనుమానితులందర్నీ దర్యాప్తు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి పనలు జరగకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.