Tablighi Jamaat Meetings: తబ్లిగీ జమాతే సమావేశాలకు అనుమతి రద్దు చేయండి, డీజీపీకి ఫిర్యాదు
రాజ్యాంగ విరుద్ధంగా ఒక తీవ్రవాద సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు కేటాయించడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది.
Bajrang Dal, Vishwa Hindu Parishad:
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో తబ్లిగీ జమాతే సమావేశాలు జరుగుతుండడం పట్ల హిందూ సంస్థలు భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు వారు ఆ సమావేశాలు నిర్వహించవద్దని డీజీపీని కోరారు. అవి తీవ్రవాద సంస్థలు అని, అలాంటి తీవ్రవాద సంస్థకు తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నించారు. శనివారం తబ్లిగీ జమాత్ లీడర్లు డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
‘‘రాజ్యాంగ విరుద్ధంగా ఒక తీవ్రవాద సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు కేటాయించడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. అసాంఘిక కార్యకలాపాలు, హిందూ వ్యతిరేక చర్యలు, సనాతన ధర్మంపై దాడి, భారతీయ అస్తిత్వంపై విద్వేషం చిమ్మే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధం. సెక్యులర్ దేశంలో మత చాందోసవాదులకు నిధులు కేటాయించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి..? తెలంగాణలో కొనసాగుతున్నది సెక్యులర్ ప్రభుత్వమా లేక ఉగ్రవాద ప్రోత్సాహక ప్రభుత్వము ప్రజలకు తెలియజేయాలి. తబ్లిగీ జమాతే సంస్థలు పలు ముస్లిం దేశాలు కూడా నిషేధించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా..? విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది.
2024 జనవరి 6 7 8 తేదీలలో వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో నిర్వహించే తబ్లిగీ జమాతే సమావేశాలను రద్దు చేయాలని మీతో విజ్ఞప్తి చేస్తున్నాం. సమాజంలో అలజనులు సృష్టించి దేశ ప్రగతికి విరోధాలు కలిగించే సంస్థలను రూపుమాపాలి. హిందూ సంస్కృతి పై నేరుగా దాడి చేసే ఇలాంటి సంస్థల వల్ల సమాజానికి చేటు కలుగుతుంది తప్ప ఇలాంటి ప్రయోజనం లేదు అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. 2020 సంవత్సరంలో ఢిల్లీలో నిర్వహించిన పబ్లిగీ జమతే వల్ల దేశంలో కరోనా పెల్లుబికిన విషయం ఇంకా భారతీయ సమాజం మర్చిపోలేదు. అమాయక యువకులను ప్రేరేపిస్తూ.. హిందూ సంస్కృతి సంప్రదాయాలను విచ్చిన్నం చేయడమే లక్ష్యంగా శిక్షణ ఇచ్చే ఇలాంటి సంస్థలను నిషేధించాల్సిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న కమిటీ జమాతే సమావేశాలను వెంటనే రద్దు చేయాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ద్వారా విడుదల చేసిన రూ.2 కోట్ల 45 లక్షల, 93 వేల,847 రూపాయలను వెంటనే రాష్ట్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందే. లేదంటే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేయక తప్పదు’’ అని వినతి పత్రంలో పేర్కొన్నారు.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, సహకార్యదర్శులు గణపురం రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్, ప్రచార ప్రసార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు గారు, తిరుపతి నాయక్ శనివారం తన కార్యాలయంలో డిజిపి రవి గుప్తాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన డీజీపీ.. ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు.