అన్వేషించండి

Bajaj Pulsar N160 Updated Version Launched: కొత్త బజాజ్ పల్సర్ ఎన్160 అప్‌డేట్ లాంచ్: గోల్డ్ కలర్ యూఎస్‌డీ ఫోర్క్స్‌తో లేటెస్ట్ వేరియంట్..

Bajaj Pulsar N160 Updated Version Launched: బజాజ్ ఆటో సరికొత్త ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ గోల్డ్ కలర్ యూఎస్‌డీ ఫోర్క్స్‌తో కూడిన కొత్త పల్సర్ ఎన్160 వేరియంట్‌ను రూ. 1.22 లక్షల ధరతో రిలీజ్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బజాజ్ పల్సర్ N160 అప్డేటెడ్ వెర్షన్ రూ. 1.22 లక్షలకు విడుదలైంది.
  • కొత్త గోల్డ్ కలర్ USD ఫోర్క్స్, రైడింగ్ మోడ్స్, USB పోర్ట్ ఉన్నాయి.
  • 164.82 సీసీ ఇంజిన్, 15.7 బీహెచ్‌పీ పవర్, 5-స్పీడ్ గేర్‌బాక్స్.
  • నాలుగు కలర్లలో లభ్యం, TVS, హీరో బైకులకు పోటీ ఇస్తుంది.

Bajaj Pulsar N160 Updated Version Launched in India: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లోకి అప్‌డేటెడ్ పల్సర్ ఎన్160 మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త వేరియంట్ ధరను రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ట్రిమ్‌లో రైడర్లకు మెరుగైన బ్యాలెన్స్, కంట్రోల్ అందించడానికి సరికొత్త టెక్నాలజీ ఫీచర్లను యాడ్ చేశారు. బడ్జెట్ రేంజ్ లో స్పోర్టీ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. బజాజ్ కంపెనీ ఈ సిరీస్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫీచర్లను జోడించడం విశేషం.

Read Also: Summer Car Care Tips: ఎండల్లో మీ కారు ఇంజిన్ సీజ్ అవ్వకుండా ఉండాలా? నిపుణులు చెబుతున్న ఐదు టిప్స్ పాటించండి! 

గోల్డ్ కలర్ యూఎస్‌డీ ఫోర్క్స్..

ఈ కొత్త వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణ ఫ్రంట్ భాగంలో ఇచ్చిన గోల్డ్ కలర్ అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్. ఇది బైక్‌కు ప్రీమియం లుక్ ఇవ్వడమే కాకుండా రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ను మరింత స్మూత్‌గా మారుస్తుంది. ఈ పర్టిక్యులర్ వేరియంట్ సింగిల్-ఛానల్ ఏబీఎస్ (ABS), కంఫర్టబుల్ సింగిల్-సీట్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. విభిన్న రోడ్ కండిషన్స్ కు తగినట్లుగా ఇందులో మల్టిపుల్ రైడింగ్ మోడ్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. స్టైలిష్ డిజైన్ తో పాటు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ లాంటి మోడర్న్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read Also: Honda Activa e vs TVS iQube: యాక్టివా ఇ స్కూటర్‌ వర్సెస్‌ టీవీఎస్‌ ఐక్యూబ్, ధర,మైలేజీలో ఏద బెస్ట్? పూర్తి పోలిక ఇక్కడ!

పవర్‌ఫుల్ ఇంజిన్ కెపాసిటీ.. 

ఈ సరికొత్త అప్‌డేట్‌లో మెకానికల్ పరంగా ఎలాంటి చేంజ్స్ చేయలేదు. ఈ బైక్ మునుపటి లాగే పవర్‌ఫుల్ 164.82 సీసీ, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 15.7 బీహెచ్‌పీ పవర్, 14.65 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ మోటార్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. మెరుగైన గ్రిప్ కోసం ఈ బైక్‌కు 17-ఇంచుల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీ కోసం ఫ్రంట్, రియర్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ అమర్చారు. కన్సోల్ విషయానికి వస్తే అవసరమైన రైడ్ ఇన్ఫర్మేషన్‌ను డిస్‌ప్లే చేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీని హయ్యర్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది.

కలర్ ఆప్షన్లు.. మార్కెట్ లో గట్టి పోటీ

ఈ అప్‌డేటెడ్ మోటార్‌సైకిల్ పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే, బ్రూక్లిన్ బ్లాక్ లాంటి నాలుగు ఆకర్షణీయమైన కలర్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం పల్సర్ ఎన్160 బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 1.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. మార్కెట్లో ఈ 160 సీసీ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ బడ్జెట్ లో అడ్వాన్స్‌డ్ ఫోర్క్స్, రైడింగ్ మోడ్స్ ఫీచర్లు కావాలనుకునే బైక్ లవర్స్‌కు ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

Frequently Asked Questions

బజాజ్ పల్సర్ N160 అప్డేటెడ్ వెర్షన్ ధర ఎంత?

బజాజ్ పల్సర్ N160 అప్డేటెడ్ వెర్షన్ ధర రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.

కొత్త బజాజ్ పల్సర్ N160 లో ముఖ్యమైన అదనపు ఫీచర్లు ఏమిటి?

ఈ కొత్త ట్రిమ్ లో గోల్డ్ కలర్ అప్‌సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు జోడించబడ్డాయి.

బజాజ్ పల్సర్ N160 ఇంజిన్ సామర్థ్యం ఏమిటి?

ఈ బైక్ 164.82 సీసీ, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 15.7 బీహెచ్‌పీ పవర్, 14.65 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

బజాజ్ పల్సర్ N160 ఏయే రంగులలో లభిస్తుంది?

ఈ అప్‌డేటెడ్ మోటార్‌సైకిల్ పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే, బ్రూక్లిన్ బ్లాక్ లాంటి నాలుగు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget