Ram Mandir Inauguration: అయోధ్య వేడుక సెలవుని వెనక్కి తీసుకున్న ఢిల్లీ ఎయిమ్స్, యథాతథంగా ఓపీ సేవలు
Ayodhya Ram Mandir Inauguration: అయోధ్య వేడుక సందర్బంగా ముందు సెలవు ప్రకటించిన ఢిల్లీ ఎయిమ్స్ తరవాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
Ayodhya Ram Mandir: ఢిల్లీలోని All India Institute of Medical Sciences (AIIMS) అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ రోజున మధ్యాహ్నం 2.30 గంటల వరకూ OP సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సోమవారం ఎప్పటిలాగే ఓపీ విభాగం పని చేస్తుందని స్పష్టం చేసింది. అయోధ్య ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు సేవలు నిలిపివేస్తున్నట్టు చెప్పినా... పేషెంట్స్‌కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఎయిమ్స్ వెల్లడించింది. ఇప్పటికే చాలా మంది అపాయింట్‌మెంట్స్ తీసుకున్నారని, వాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని వివరించింది. ఇక మిగతా క్రిటికల్ క్లినికల్ కేర్ విభాగాలూ ఎప్పటిలాగే తెరిచే ఉంటాయని తెలిపింది. అంతకు ముందు హాఫ్‌డే సెలవు ప్రకటిస్తూ మెమెరాండం జారీ చేసిన ఎయిమ్స్...ఎమర్జెన్సీ సర్వీస్‌లకు ఎలాంటి అంతరాయం కలగదని స్పష్టం చేసింది. అయితే...సెలవు ప్రకటించడం వల్ల రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న వాదనలు వినిపించాయి. అందుకే...మరోసారి ఆలోచించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే..కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే Safdarjung Hospital మాత్రం హాఫ్‌డే సెలవుని యథాతథంగా కొనసాగించనుంది.
The Outpatient Department shall remain open to attend patients with appointments tomorrow, Monday 22nd January: AIIMS New Delhi https://t.co/EfUPdg6Gij pic.twitter.com/gTJhVB7khK
— ANI (@ANI) January 21, 2024
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్యాలయాలకు జనవరి 22న సగం రోజు సెలవును ప్రకటించింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకే కార్యాలయాలను నడుస్తాయని వెల్లడించింది. ప్రజల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించారు. ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహం నెలకొంది. ఆ రోజు పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 22న పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు. జనవరి 22న రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు యోగి తెలిపారు. ఆ రోజున ఏ విద్యా సంస్థలనూ తెరవరు.మధ్యప్రదేశ్‌లోనూ పాఠశాలలు, కళాశాలలకు 22న సెలవు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద పండుగలాంటిదని సీఎం పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.
ఒక్క భారత్‌లోనే కాదు. అయోధ్య ఉత్సవ సందడి ప్రపంచమంతటా కనిపిస్తోంది. విదేశీయులూ రామ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. NRIలు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్ని అందంగా అలంకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఏకమై ఈ వేడుకలు చేసుకుంటన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలో దాదాపు 300 చోట్ల ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. న్యూయార్క్‌లోని Times Squareతో పాటు మిగతా చోట్ల కూడా లైవ్ టెలికాస్ట్‌కి ఏర్పాట్లు చేశారు. అటు పారిస్‌లోనూ ఈఫిల్ టవర్ కూడా అయోధ్య ఉత్సవానికి సిద్ధమవుతోంది.
Also Read: Ram Mandir: ఈఫిల్ టవర్‌పైనా అయోధ్య సంబరాలు, ప్రపంచదేశాల్లో హిందువుల సందడి