Ayodhya Deepotsav 2022: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం, హాజరు కానున్న ప్రధాని మోదీ
Ayodhya Deepotsav 2022: అయోధ్యలో జరిగే దీపోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.
Ayodhya Deepotsav 2022:
15 లక్షల దీపాలు..
ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలకు హాజరు కానున్నారు. సాయంత్రం జరగనున్న దీపోత్సవానికి ముఖ్య అతిథిగా రానున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం...మోదీ ముందుగా సాయంత్రం 5 గంటలకు భగవాన్ రామ్‌లల్లా విరాజ్‌మాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరవాత రామ్ జన్మభూమి తీర్థక్షేత్రను సందర్శిస్తారు. 5.45 నిముషాలకు భగవాన్ రామ్‌కు రాజ్యాభిషేకం చేస్తారు. 6.30 నిముషాలకు సరయూ నదిలో హారతి ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే దీపోత్సవంలో పాల్గొంటారు. ఆరేళ్లుగా ఇక్కడ దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ తొలిసారి నేరుగా ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా...15 లక్షలకు పైగా దీపాలు వెలిగిస్తారని అంచనా. రాముడి యానిమేటెడ్ ఇమేజ్‌లనూ ప్రదర్శించనున్నారు. వీటితో పాటు రకరకాల రాష్ట్రాలకు చెందిన కళాకారులు నృత్య ప్రదర్శనలు చేస్తారు. తరవాత గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షో ఏర్పాటు చేస్తారు. సరయూ నదీ తీరాన...3-D Holographic Projection Mapping Showకి ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రధాని రాకతో...అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Uttar Pradesh | Security heightened in Ayodhya ahead of PM Modi's arrival to take part in Deepotsav celebrations
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 23, 2022
PM will offer prayers to Lord Ramlala Virajman, followed by an inspection of the Shree Ram Janmabhoomi Teerth Kshetra site. pic.twitter.com/VfIxbHOcj7
దారి మళ్లింపు..
ప్రధాని మోదీ రాకతో...కొన్ని చోట్ల దారులు మళ్లించనున్నారు. రాత్రి 8 గంటల వరకూ కొన్ని ఆంక్షలు విధిస్తారు. భారీ వాహనాలు, డీసీఎమ్‌లు, ట్రాక్టర్లు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోనున్నారు. లక్నో నుంచి గోరఖ్‌పూర్ లేదా బస్తీ వెళ్లే వాళ్లు...వయా బరబంకి నుంచి జర్వాల్ రోడ్ వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.