అన్వేషించండి

Road Accident : ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 66 మంది మృతి

Road Accident : దక్షిణ ఇథియోపియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నారని సిడామా లోకల్ హెల్త్ బ్యూరో ధృవీకరించింది.

Road Accident : దక్షిణ ఇథియోపియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 66 మందికి పైగా మరణించారు. బోనా జురియా వోరెడాలోని గెలాన్ వంతెన వద్ద జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 66 మంది ప్రాణాలు కోల్పోయారని సిడామా హెల్త్ బ్యూరో తెలిపింది. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన సిడామా లోకల్ హెల్త్ బ్యూరో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. "కారు ప్రమాదంలో ఇప్పటివరకు 66 మంది ప్రాణాలు కోల్పోయారు" అని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ బ్యూరో ప్రకారం, బోనా జురియా వోరెడాలోని గెలానా వంతెన వద్ద ఈ సంఘటన జరిగింది. గాయపడిన నలుగురు ప్రయాణికులు ప్రస్తుతం బోనా జనరల్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు.

హెల్త్ బ్యూరో షేర్ చేసిన కొన్ని అస్పష్టమైన చిత్రాలలో అనేక మంది వాహనాన్ని చుట్టుముట్టినట్టు కనిపించారు. అందులో కొందరు పాక్షికంగా నీటిలో మునిగిపోయారు. చాలా మంది వాహనాన్ని నీటిలో నుండి లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. ఇతర చిత్రాలు నేలపై పడి ఉన్న నీలిరంగు టార్పాలిన్‌తో కప్పిన మృతదేహాలను చూపుతున్నాయి. ప్రమాద బాధితులకు బ్యూరో తన సంతాపాన్ని వ్యక్తం చేసింది.  విచారణ పూర్తయిన తర్వాత మొత్తం ప్రయాణికులు, వాహనాల సంఖ్యతో సహా అదనపు సమాచారం వెల్లడిస్తామని బ్యూరో హామీ ఇచ్చింది.  

Also Read : Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!

ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు వంతెన మీదుగా వెళుతుండగా అదుపు తప్పి గలానా నదిలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. బాధితుల్లో అదే ప్రాంతానికి చెందిన యువకులు వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా జరిగిందన్నారు. వీరంతా కాఫీ సైట్‌లో పనిచేస్తున్నారని తెలిపారు.

ఇథియోపియాలో రోడ్డు ప్రమాదాలు

సిడామా రాష్ట్రం రాజధాని నగరం అడిస్ అబాబాకు దక్షిణంగా 300 కిలోమీటర్లు (180 మైళ్ళు) దూరంలో ఉంది. ఇథియోపియాలో సరైన రోడ్లు, తగినంత భద్రతా చర్యలు లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారింది. ట్రాఫిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం ముసాయిదా వ్యూహాలను నియంత్రిస్తున్నప్పటికీ, పాదచారులు, డ్రైవర్ల నుండి ప్రధాన సమస్యలు తీవ్రమవుతున్నాయి. దూకుడు చర్యలతో సహా డ్రైవర్ల చెడు ప్రవర్తన ఇథియోపియాలో ట్రాఫిక్ ప్రమాదానికి ప్రధాన కారణంగా మారుతోంది.

1999 నుండి 2013 వరకు, ట్రాఫిక్ ప్రమాదాలకు చాలా వరకు డ్రైవర్లు, చదువుకోని వ్యక్తులు, చాలా కాలం పాటు ఉపయోగించిన వాహనాలు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోవడం, ఓవర్ స్పీడ్, ఓవర్‌లోడింగ్, డ్రంక్ డ్రైవింగ్ వంటి అంశాలు కూడా కారణమని తెలుస్తోంది.

Also Read : China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. 184 రన్స్ తో  కంగారూల భారీ విజయం.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. 184 రన్స్ తో కంగారూల భారీ విజయం.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Aus Vs Ind Test Series: బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. 184 రన్స్ తో  కంగారూల భారీ విజయం.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
బాక్సింగ్ డే టెస్టు ఆసీస్ దే.. 184 రన్స్ తో కంగారూల భారీ విజయం.. నాలుగో టెస్టులో భారత్ ఓటమి
Allu Arjuns Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాదనలు పూర్తి, తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Soniya Singh and Pavan Sidhu : సిద్ధూని లాగిపెట్టి కొట్టిన సోనియా... తమన్నాకు ఇచ్చిన రెస్పెక్ట్ లైఫ్ పార్టనర్​​కే ఇవ్వడా?
సిద్ధూని లాగిపెట్టి కొట్టిన సోనియా... తమన్నాకు ఇచ్చిన రెస్పెక్ట్ లైఫ్ పార్టనర్​​కే ఇవ్వడా?
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సభలో తీర్మానం
Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Embed widget