అన్వేషించండి

Election 2022 Date Announcement LIVE: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఎన్నికల ప్రక్రియను శనివారం ప్రకటిస్తుంది.

Key Events
Assembly election 2022 dates announcement live updates uttar pradesh uttarakhand goa punjab manipur eci guidelines and details Election 2022 Date Announcement LIVE: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
EC_LIVE

Background

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలనే వివిధ పార్టీలు కోరుతున్నాయి. అయితే భారత ఎన్నికల సంఘం శనివారం 5 రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం ఈసీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తుంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. 

ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.  మణిపూర్ లో రెండు ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3 న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు.  

7 దశల్లో ఎన్నికల నిర్వహణ 

మెుదటి దశ పోలింగ్ తేదీ : ఫిబ్రవరి 10
రెండో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 14(పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్)
మూడో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 20
నాలుగో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 23
ఐదో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 27(మణిపూర్)
ఆరోదశ పోలింగ్ తేదీ : మార్చి 3(మణిపూర్)
ఏడో దశ పోలింగ్ తేదీ : మార్చి 7 

కోవిడ్ వల్ల పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గించామని సీఈసీ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవపరిమితి రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎన్నికల అబ్జర్వర్లు నియమించినట్లు తెలిపారు. 

అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలకు అనుమతి 

కోవిడ్ కారణంగా జనవరి 15 వరకు రోడ్ షోలను నిషేధించామని సీఈసీ తెలిపారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటలకు వరకూ పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదని పేర్కొన్నారు. అభ్యర్థుల విజయోత్సవాలు రద్దు చేసినట్లు తెలిపారు. పాదయాత్రలు, రోడ్ షోలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో నామినేషన్ వేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. డబుల్ వ్యాక్సిన్లు తీసుకున్నవారినే ఎన్నికల డ్యూటీ వేస్తామన్నామని సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. 

16:20 PM (IST)  •  08 Jan 2022

ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు

ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.  మణిపూర్ లో రెండు ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3 న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు.  

16:10 PM (IST)  •  08 Jan 2022

7 దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 ఫేజ్ లలో నిర్వహిస్తామని సీఈసీ తెలిపారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget