అన్వేషించండి

Assam-Mizoram Border Clash: అసోం-మిజోరం మధ్య అసలు సరిహద్దు వివాదం ఏంటి?

అసోం- మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చెలరేగింది. ఈ ఘర్షణలో ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందారు. అసలు ఈ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటిది?

ఈశాన్య భారతంలో మళ్లీ అలజడి చెలరేగింది. అసోం-మిజోరం రాష్ట్రాల సరిహద్దులో హింస పెల్లుబికింది. ఇరు రాష్ట్రాలు రాళ్లు రువ్వుకున్నాయి, పోలీసులు కాల్పులు జరపడంతో కొందరు తీవ్రంగా గాయపడగా ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందారు. రైతుల గుడిసెలు తగలబడ్డాయి. ప్రభుత్వ వాహనాలు కూడా ధ్వంస మయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. బ్రిటీషు కాలం నుంచే ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. అసలు ఈ వివాదం ఏంటి? ఇప్పుడు ఎందుకు తిరగబెట్టింది..?

ఇప్పటిది కాదు..

అసోం- మిజోరం సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. బ్రిటీషు కాలం నుంచే ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య జూన్ నెల నుంచే తాజా వివాదం నడుస్తోంది. ఐత్లాంగ్హనార్ అనే ప్రాంతాన్ని అసోం తమ అధీనంలోకి తీసుకుంది. తమ భూభాగమైన ఆ ప్రాంతాన్ని మిజోరం ఆక్రమించుకుందంటూ అసోం ఆరోపించింది.

ఇక మిజోరంలోని మూడు జిల్లాలు అంటే ఐజ్వాల్, కొలాసిబ్, మమిత్‌లు అసోంలోని కాచర్, కరీంగంజ్, హైలకంది జిల్లాలతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్నాయి. జూన్ 30న కొలాసిబ్‌ జిల్లాకు సమీపంలోని సరిహద్దు దాటి అసోం తమ రాష్ట్ర భూభాగంలోకి అక్రమంగా చొరబడిందని మిజోరం ఆరోపణలు చేసింది. అయితే మిజోరం రాష్ట్రమే అసోంలోని హైలకంది జిల్లాలోకి 10 కిలోమీటర్ల మేర అక్రమంగా చొరబడి అక్కడ అరటి చెట్లు, వక్కపొడి చెట్లను నాటిందని అసోం రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు. ఇక అసోం పోలీసులు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలోకి వచ్చి క్యాంపు వేశారని ఆ జిల్లా ఎస్పీ వాన్లాల్ ఫకా రాల్టే ఆరోపించారు.

ప్రత్యారోపణలు..

అసోం అధికారులు క్యాంపు వేసిన ప్రాంతం స్థానికంగా ఐత్లాంగ్హనార్ అని పిలుస్తారు. ఇది ఐత్లాంగ్ నది సమీపంలో ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతం తమ రాష్ట్రానికి చెందుతుందని మిజోరం చెబుతోంది. ఈ గ్రామం అసోం సరిహద్దులో ఉంటుందని మిజోరం చెబుతోంది. అయితే అసోం వాదన ఇందుకు భిన్నంగా ఉంది. మిజోరం రాష్ట్రమే తమ భూభాగంలోకి అడుగుపెట్టి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తోందని అసోం మండిపడింది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆ తర్వాత అది కాస్త పెరగడంతో వివాదం మరింత వేడిని పెంచింది. దీంతో హింస చెలరేగింది.

ఆనాడు..

వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి బీజం బ్రిటీషు కాలంలోనే పడింది. అంతకుముందు అసోం-మిజోరం రాష్ట్రాల మధ్య వివాదాలు చాలా తక్కువగా ఉండేవి. ప్రస్తుతం అసోం- మిజోరం రాష్ట్రాల మధ్య సరిహద్దు 165 కిలో మీటర్ల మేర ఉంది. ఒకప్పుడు మిజోరంను లుషాయ్ హిల్స్ అని పిలిచేవారు. అప్పుడు ఇది అసోం రాష్ట్రంలో ఒక జిల్లాగా ఉండేది. అయితే 1857లో అప్పటి బ్రిటీషు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం లుషాయ్ హిల్స్‌.. కాచర్ ప్రాంతం నుంచి వేరుపడింది. ఆ తర్వాత 1933లో లుషాయ్ హిల్స్ మణిపూర్‌ల మధ్య ఓ సరిహద్దును తీసుకొస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇందుకు మిజోరం వాసులు అంగీకరించలేదు

ఇక భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఈశాన్య భారతంలో క్రమంగా రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. నాగాలాండ్(1963), అరుణాచల్ ప్రదేశ్ (1972) , మేఘాలయా (1972) మిజోరం (1972)రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అయితే మిజోరం- అసోం మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఉమ్మడి సరిహద్దు వద్ద స్టేటస్‌కో మెయిన్‌టెయిన్ చేయాలని నిర్ణయించాయి. అయితే 2018 ఫిబ్రవరిలో మిజో జిర్లాయ్ పాల్ అనే విద్యార్థి సంఘం మిజోరం రైతుల కోసం అసోం భూభాగంలో ఒక రెస్ట్ హౌస్ నిర్మించారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోం పోలీసులు దాన్ని కూల్చివేశారు. అయితే గతేడాది అక్టోబర్‌లో ఒకే వారంలో రెండు సార్లు హింస చెలరేగింది. అసోంలోని లైలాపూర్ లో ఓ నిర్మాణం చేపట్టడంతో మిజోరం భగ్గుమంది. అది తమ భూభాగం అని వాదించింది.

ప్రస్తుతం పరిస్థితి మాత్రం కాస్త హింసాత్మకంగానే కనిపిస్తోంది. అసోం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తోందంటూ మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా.. అమిత్ షా, ప్రధాని కార్యాలయానికి ట్వీట్ చేశారు. కొందరు ఆందోళనకారులు కర్రలు పట్టుకుని మిజోరం భూభాగంలోకి రావడం, అసోం పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్‌లకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. అయితే మిజోరం స్థానికులే రాళ్లు రువ్వుతున్నారంటూ అసోం పోలీసులు ఫిర్యాదు చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ, మిజోరం సీఎం జోరాంతంగాలు కేంద్రాన్ని కోరారు. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
PM Modi News: విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్‌ నమో నమః స్పీచ్‌
విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్‌ నమో నమః స్పీచ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP DesamTimelapse of leaves emerging in space | స్పేడెక్స్ ఉపగ్రహంలో వ్యవసాయం సక్సెస్ | ABP DesamIndias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
PM Modi News: విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్‌ నమో నమః స్పీచ్‌
విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్‌ నమో నమః స్పీచ్‌
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Fake Customer Care Calls: ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Embed widget