(Source: ECI/ABP News/ABP Majha)
Assam Heavy Floods: మరోసారి వరదలతో వణికిపోతున్న అసోం - 15 మంది మృతి
Assam Heavy Floods: అసోంలో మరోసారి వరదలు బీభత్సం సృష్టించాయి. వరద కారణంగా 15 మంది మృతి చనిపోయారు.
Assam Heavy Floods: అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. అసోంలోని నదులు, జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. పెరుగుతున్న నీటిమట్టాల కారణంగా బ్రహ్మపుత్ర నదిలో గౌహతి, జోర్ఘాట్ లోని నేమతిఘాట్ లో ఫెర్రీ సేవలు నిలిపి వేశారు. వదల ధాటికి రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, పాఠశాలల పూర్తిగా నాశనం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని మించి పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది వరదల వల్ల 15 మంది చనిపోయారు. 17 జిల్లాల్లోని 2 లక్షల మంది వరదల బారిన పడ్డారు. లఖింపూర్, ధేమాజీ జిల్లాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. మొత్తం 427 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. మరో 45 ఆహార పంపిణీ కేంద్రాలు పని చేస్తున్నాయి. బెకి, జియా - భరాలీ, దిసాంగ్, డిఖౌ, సుబన్ సిరి నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.
నదుల నీటి మట్టాలు పెరగడంతో నెమటిఘాట్, మజులి మధ్య ఫెర్రీ సేవలను నిలిపి వేసినట్లు అధికారులు చెప్పారు. అలాగే ప్రస్తుతం 8,086.40 హెక్టార్ల పంట భూములు వరద నీటిలో మునిగాయి. 81 వేల 340 జంతువులు, 11 వేల 886 కోళ్లతో సహా లక్షా 30 వేల 514 జంతువులు వరదల బారిన పడ్డాయని అధికారులు చెప్పారు. ఉదల్ గురిలోని రెండు ప్రాంతాలు బిస్వనాథ్ దర్రాంగ్ లలో వరద నీటితో ఆనకట్టలు తెగిపోయాయి. వరదల్లో రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి.
నెల రోజుల క్రితం కూడా భారీ వరదలు - లక్షా 20 వేల మంది అవస్ఖలు
అసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల ప్రభావం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ భారీ వరదలతో 1.20 లక్షల మందికిపైగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వానలతో రోడ్లు ఎక్కిడకక్కడ దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వానలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు నదులు ఉగ్రరూపం దాల్చాయి. చాలా నదులు, కాల్వలు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. 20 జిల్లాల్లోని 1.20 లక్షల మందికి పైగా వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వరదల్లో చిక్కుకున్న పెంపుడు జంతువులు, కోళ్లు
నల్బరీ జిల్లాలో 44,708 మంది, లఖింపూర్ లో 25,096 మంది, బార్ పేట జిల్లాలో 3,840 మంది, బక్సాలో 26,571 మంది, తముల్ పూర్ లో 15,610 మంది వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 1.07 లక్షల పెంపుడు జంతువులు, కోళ్లు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా రాష్ట్రంలో బుధవారం నాలుగు కట్టలు, 72 రోడ్లు, 7 బ్రిడ్జీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
సురక్షిత ప్రాంతాలకు జనాల తరలింపు
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత జిల్లాల్లో 14 సహాయక శిబిరాలు, 17 సహాయ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ధుబ్రి, బక్సా, కోక్రాఝర్, తముల్పూర్, నల్పారి జిల్లాల్లోని సహాయ శిబిరాల్లో సుమారు 2,091 మంది ప్రజలు ఉన్నట్లు వెల్లడించారు.