Kejriwal On Indian Currency: మన దేశం బాగుపడాలంటే కరెన్సీపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలి - కేజ్రీవాల్
Kejriwal On Indian Currency: ఇండియన్ కరెన్సీపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేజ్రీవాల్ కేంద్రానికి సూచించారు.
Kejriwal On Indian Currency:
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మన ఇండియన్ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి సూచించారు. లక్ష్మీ దేవి, గణేషుడి బొమ్మలు మన కరెన్సీపై ఉంటే దేశం ఇంకా సంపన్నమవుతుందని అన్నారు. మహాత్మా గాంధీ బొమ్మ పక్కనే లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలూ ముద్రించాలని సూచించారు. "ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుడి బొమ్మ ఉన్నప్పుడు మన కరెన్సీపై ఉంటే తప్పేంటి. ఈ విషయమై కేంద్రానికి రెండ్రోజుల్లో లేఖ రాస్తాను. ప్రస్తుత మన దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడాలంటే ఆ దేవతల ఆశీర్వాదం కూడా అవసరమే" అని వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్.
I appeal to the central govt & the PM to put the photo of Shri Ganesh Ji & Shri Laxmi Ji, along with Gandhi Ji's photo on our fresh currency notes, says Delhi CM & AAP national convenor Arvind Kejriwal pic.twitter.com/t0AWliDn75
— ANI (@ANI) October 26, 2022
వెంటాడుతున్న సీబీఐ
ఆమ్ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను CBI వెంటాడుతోంది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ప్రస్తుతం ఆయన సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారు. అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఆదివారం సీబీఐ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. దీనిపై సిసోడియా స్పందించారు. "నేను వెళ్తాను. సీబీఐ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. దాదాపు 14 గంటల పాటు నా ఇంట్లో సోదాలు చేశారు. ఇది చాలదని మా గ్రామానికీ వెళ్లి అక్కడా రెయిడ్స్ కొనసాగించారు. మేం తప్పు చేశామనటానికి ఇప్పటి వరకూ వాళ్లకు ఎలాంటి ఆధారాలు లభించ లేదు" అని ట్వీట్ చేశారు. ఆగస్టులో సిసోడియా ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయనతో పాటు మరి కొందరు ఇళ్లలోనూ రెయిడ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవిద్ కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. "మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేస్తారు. డిసెంబర్ 8వ తేదీ తరవాత గుజరాత్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాకే ఆయనను విడుదల చేస్తారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకుండా చేయటమే వాళ్ల వ్యూహం" అని మండి పడ్డారు.
లిక్కర్ స్కామ్..
దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది.
Also Read: G20 Summit: రిషి సునక్‌తో ప్రధాని మోదీ భేటీ- ఆ ఒప్పందం గట్టెక్కేనా?