Aral Sea:50 ఏళ్లలో మాయమైపోయిన సముద్రం, వాతావరణ మార్పుల ఎఫెక్ట్
Aral Sea: వాతావరణ మార్పుల కారణంగా కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ మధ్యలో ఉన్న Aral Sea మాయమైపోయింది.
Aral Sea Disappeared: అన్ని దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం అన్ని చోట్లా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన నెలగా రికార్డుకెక్కింది. ఈ నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరిగాయి. కానీ...పదేళ్ల ముందు నుంచే ఈ ప్రభావం మొదలైందనడానికి ఓ ఆధారాన్ని కనుగొన్నారు సైంటిస్ట్‌లు. ఓ సముద్రమే కనిపించకుండా పోవడాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఇదే అన్ని దేశాలనూ షాక్‌కి గురి చేస్తోంది. కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ మధ్యలో ఉన్న Aral Sea మాయమైపోయింది. 2010 నాటికే ఇది ఆవిరైపోయిందని గుర్తించారు. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సరస్సుగా పేరొందింది Aral Sea. మొత్తం 68 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. 1960ల నుంచే క్రమంగా ఇది కుచించుకుపోతూ వచ్చింది. సోవియెట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం పెద్ద ఎత్తున నీటిని తరలించడం వల్ల ఇది ఎండిపోయింది.
నాసా ఏం చెప్పిందంటే..?
NASA's Earth Observatory ఈ విషయం వెల్లడించింది. అరల్ సీ ఎందుకు కనుమరుగైపోయింది వివరించింది. 1960ల నాటికి సోవియట్ యూనియన్ భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు చేపట్టింది. కజికిస్థాన్,ఉజ్బకిస్థాన్, తుర్కుమెనిస్థాన్‌కి భారీ ఎత్తున నీటిని తరలించింది. ఈ ప్రాంతానికి ఉత్తరాన Syr Darya దక్షిణాన Amu Darya అనే నదులున్నాయి. ఈ నదుల నుంచి నీళ్లను మళ్లించారు. ఆ తరవాతే ఎడారి లాంటి ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోయింది. పంటలు పండాయి. ఆ నదుల్లోని నీరే కొండలు గుట్టలు దాటి చివరగా అరల్ సీ లో కలిసేవి. అయితే...ఈ నీళ్లన్నీ ఇరిగేషన్ కోసం మళ్లించడం వల్ల క్రమంగా Aral Sea కనుమరుగవడం మొదలైంది. 20 లక్షల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడిన ఈ సముద్రం...ఇప్పుడు మ్యాప్‌లో కనిపించకుండా పోయింది. నీళ్లన్నీ ఆవిరైపోయాయి. ఈ సమస్యని పరిష్కరించేందుకు డ్యామ్ నిర్మించినప్పటికీ లాభం లేకుండా పోయింది. మునుపటిలా అక్కడ నీళ్లే కనిపించడం లేదని సైంటిస్ట్‌లు చెబుతున్నారు.