అన్వేషించండి

ఆప్కాబ్‌ 60 ఏళ్ల ప్రయాణంలో రైతులకు అండగా నిలిచింది: సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఏపీ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్‌ కి అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఏపీ సీఎం జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఏపీ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జగన్‌ కి మంత్రులు కాకాణి గోవర్థన్‌ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత జగన్ బ్యాంక్‌ నూతన లోగో , పోస్టల్‌ స్టాంపును ఆవిష్కరించారు.  కొత్త బ్రాండ్‌ సంకల్ప్ ప్రాజెక్ట్‌ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 

వీటితో పాటు 13 డీసీసీబీలకు డివిడెంట్ల పంపిణీతో పాటు బ్యాంక్‌ విజన్‌ డాక్యుమెంట్స్‌ ను జగన్‌ ఆవిష్కరించారు. రాష్ట్ర సహకార రంగం చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందని జగన్‌ అన్నారు. ఆప్కాబ్ 60 ఏళ్ల ప్రయాణంలో ఆప్కాబ్ రైతులకు అండగా నిలబడిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్కాబ్ ను నిలబెట్టడంలో కీలక పాత్ర వహించారని కొనియాడారు. 

భారత రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే బతుకుతాడు చివరికి అప్పుల్లోనే చనిపోతడాని ఓ నానుడి ఉండేదని.. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గరకు అడుగులు వేడయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఆప్కాబ్‌ రైతులకు ఇస్తున్న చేయూత ఎనలేనిదన్నారు. రైతులకు ఆప్కాబ్‌ వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. సహకార బ్యాంకులు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు ఇస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. 

రానున్న రోజుల్లో డిజిటలైజేషన్‌ తో సేవలు మరింత వేగాన్ని అందుకుంటాయన్నారు. ఆప్కాబ్‌ సేవలన్నీ మరింతగా విస్తరిస్తున్నాయన్నారు. ఆర్‌బీకే స్థాయిలోనే రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. దేశ చర్రితలోనే ఆప్కాబ్‌ కు మంచి గుర్తింపు ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూస్తామని తెలిపారు సీఎం జగన్. ఆర్‌బీకేలు రైతుల చేయి పట్టుకుని నడిస్తున్నాయని, ఆర్‌బీకేలను ఆప్కాబ్‌ తో అనుసంధానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

కాగా 1963 లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ ప్రారంభమైంది. ఆప్కాబ్ పరిధిలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 1995 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.36,732 కోట్ల టర్నోవర్ సాధించింది ఆప్కాబ్. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ నాలుగేళ్లలో రూ.251 కోట్ల లాభాల్లోకి ఆప్కాబ్ వెళ్లింది. రెండు సార్లు జాతీయ అవార్డులను సాధిచింది.

 

టాప్ హెడ్ లైన్స్

Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 19న ప్రారంభం, రూ.1 లక్ష జమ
రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నవంబర్ 19న ప్రారంభం, రూ.1 లక్ష జమ
ABP Desam Top 10, 16 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 16 September 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Samson Opening Debate: సూర్యవంశీతో పోటీపై సంజూ బోల్డ్ కామెంట్స్, నెగిటివ్ ఆలోచ‌న‌లు ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేసిన శాంస‌న్
సూర్యవంశీతో పోటీపై సంజూ బోల్డ్ కామెంట్స్, నెగిటివ్ ఆలోచ‌న‌లు ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేసిన శాంస‌న్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget