అన్వేషించండి

Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

అర్నాబ్ తుపాను వాతావరణశాఖ ఊహించిన దాని కంటే చాలా వేగంగా దూసుకొస్తుంది. ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టి పరిస్థితులను ఎదుర్కొంటోంది.

LIVE

Key Events
Cyclone Arnab impact Live Updates in Andhra Pradesh Cyclone Arnab Live Updates: కాకినాడ సమీపంలో సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
అర్నాబ్ తుపాను ప్రభావంతో వర్షాలు
Source : APSDMA

Background

అర్నాబ్ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సన్నద్ధత, ముందస్తు చర్యలపై అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడికి అధికారులు సమగ్ర వివరణ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే 11 జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను తరలించినట్లు తెలియజేశారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలు మరియు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభావిత జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు, ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు జిల్లా, మండల స్థాయిలలో మొత్తం 2,907 కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

మంగళవారం (27-10-2026)  కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో  అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ; శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు ; పల్నాడు, ప్రకాశం, మార్కాపురం,నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

బుధవారం (28-10-2026) :
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో  అక్కడక్కడ  అత్యంత భారీ వర్షాలు ; శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు ; పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

15:24 PM (IST)  •  28 Oct 2026

హోంమినిస్టర్ ఆన్ డ్యూటీ... పాయకరావుపేట పునరావాస కేంద్రాల్లో తనిఖీలు 

బంగాళాఖాతంలో విరుచుకుపడిన 'అర్ణబ్' తుఫాన్ ధాటికి దెబ్బతిన్న గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని ఎస్. రాయవరం మండలం చిన్నగుమ్ములూరుతో పాటు పలు ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన ఆమె, తుఫాన్ బాధితులను కలిసి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పునరావాస కేంద్రాలను సందర్శించిన హోంమంత్రి.. అక్కడి ప్రజలకు అందుతున్న భోజన, వైద్య సౌకర్యాలను, తాగునీటి సరఫరాను స్వయంగా తనిఖీ చేశారు.  ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని, ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని ఈ సందర్భంగా హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు.

15:05 PM (IST)  •  28 Oct 2026

సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను క్లియర్ చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

అర్నబ్ తుఫాన్‌పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపుపై అధికారులతో సమీక్ష

కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం

జిల్లాల వారీగా పరిస్థితులను, గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను ముఖ్యమంత్రికి వెల్లడించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్
• విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
• కోనసీమలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్టు తెలిపిన అధికారులు
• కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల చెట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలిపోయినట్లు వివరణ 
• జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు వివరించిన అధికారులు.
• వివిధ ప్రాంతాల్లో కూలిన చెట్ల తొలగింపు పనులను మధ్యాహ్నం 3 గంటల నాటికి పూర్తి చేస్తామని తెలిపిన అధికారులు.
• కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అధికారుల వెల్లడి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం ఏపీసీపీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని పంపాలి
• పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయండి.
• కూలిన చెట్లను వెంటనే తొలగించి, సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలి.
• పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి. 
• వ్యవసాయం, ఉద్యానవన శాఖలతోపాటు వివిధ విభాగాలు తుఫాన్ నష్టం అంచనాలపై దృష్టి సారించాలి.
• పశుసంపదకు జరిగిన నష్టం, ఇళ్లు కూలిపోవడం, నీట మునగడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి.
• విద్యుత్, రహదారుల వ్యవస్థలకు జరిగిన నష్టాన్ని, చెరువులకు గండ్లు పడిన అంశాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించాలి.
• రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి.
• సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడంతోపాటు వరద నీటి నిర్వహణపై దృష్టి సారించాలి.
• విద్యుత్ సరఫరా, తాగునీరు, రాకపోకలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి.
• గత పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని 26 తుఫాన్లు తాకాయి. 
• గతంలో సంభవించిన దివిసీమ ఉప్పెనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 
• దివిసీమ ఉప్పెన, హుద్ హుదు, తిత్లీ తుఫాన్ల సమయంలో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. 
• వరదల సమయంలో అప్పటి ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవస్థలు విఫలమయ్యాయి. 
• బుడమేరు వరదల్లో విజయవాడ లోనే ఉండి వ్యవస్థను గాడిలో పెట్టగలిగాం
• ప్రస్తుతం అర్నబ్ తుఫానులో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.
• రాష్ట్రాన్ని తాకిన ప్రతి తుఫాన్ నుంచి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే పాఠాలను నేర్చుకుంటున్నాం
• టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలుగుతున్నాం
• అన్ని స్థాయిల్లో అధికారులు ఒకే విధమైన ఆలోచనతో పనిచేస్తూ, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. 
• అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు, వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాం
• ప్రకృతి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా తక్షణ నిర్ణయాలు తీసుకుని, వాటిని సమర్థంగా అమలు చేయాలి
• గత రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగు మార్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలను సమీక్షిస్తున్నాం

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
నవంబర్ 18 రాశిఫలాలు: సింహానికి గందరగోళం, కన్యకు ఆనందం! మీ రాశికి ఏం జరగనుంది?
Konaseema ONGC Gas Leak: కోనసీమలో భారీగా ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ.. ప్రజల తరలింపునకు సీఎం చంద్రబాబు ఆదేశం
కోనసీమలో భారీగా ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ.. ప్రజల తరలింపునకు సీఎం చంద్రబాబు ఆదేశం
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Embed widget