News
News
వీడియోలు ఆటలు
X

AP 10TH RESULTS 2023: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదల- ఈసారి ఉత్తీర్ణత శాతం  72.26% - రిజల్ట్స్‌ లింక్‌ ఇదిగో...

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
Background

AP 10TH RESULTS 2023:ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 11 గంటలకు రిజల్ట్స్‌ను రిలీజ్ చేస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలో ఫలితాలను చూడొచ్చు. 
గత కొన్ని రోజులుగా పదో తరగతి ఫలితాలపై రకరకాల ఊహాగానాలు నడిచాయి. ఇది ఇవాళే పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. కానీ ప్రభుత్వాధికారులు వాటికి వివరణ ఇస్తూ వస్తున్నారు. చివరకు తీవ్ర తర్జనభర్జనల మధ్య ఫలితాలను శనివారం ఉదయం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించారు. గతేడాది తీవ్ర ఆరోపణలు వచ్చిన వేళ ఈసారి మరింత కఠినంగా వ్యవహరించారు. ఎక్కడా లీక్ సమస్య లేకుండా ఆదేశాలు జారీ చేశారు. 

6,64,152 మంది రాసిన పదో తరగతి పరీక్ష పేపర్‌లను ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం చేశారు. గతేడాది పదోతరగతి ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి ఆలంటి తప్పులకు అవకాశం లేకుండా చూసుకుంది. వాల్యుయేషన్ పక్కగా నిర్వహించామని చెబుతోంది. గతేడాది కంటే ఈసారి ఫలితాలు కూడా మెరుగ్గా వస్తాయని ఆశిస్తున్నారు అధికారులు. 

పదో తరగతి ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన bse.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 
అక్కడ హోమ్‌ పేజ్‌లో ఏపీ 10Th రిజల్ట్స్‌ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. 
వెంటనే వేరే పాపప్‌ ఓపెన్ అవుతుంది. 
అందులో మీ పదోతరగతి హాల్‌ టికెట్ నెంబర్‌్ టైప్ చేయాలి. 
తర్వాత కింద ఉన్న సబ్‌మిట్‌ బటన్ ప్రెస్‌ చేస్తే రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది. 
ఆ రిజల్ట్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. 

ఈసారి పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఎప్పుడూ జరిగే 7 పేప‌ర్ల విధానంలో ఆరు పేపర్లకే పరిమితం చేసింది. బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నాపత్రం తయారు చేశారు. గతేడాది వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక పేపర్, బయాలజీకి మరో పేపర్ ఉండేది. ఈసారి సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు కలిపి ఒకే ప్రశ్నాపత్రం ఇచ్చారు. జీవశాస్త్రాన్ని ప్రశ్నాపత్రంలోనే ప్రత్యేక సెక్షన్‌గా విభజించారు.

విద్యార్థులు సమాధానాలు రాసేందుకు మొదట 24 పేజీల బుక్‌లెట్ ఇచ్చారు. అదనంగా సమాధాన పత్రాలు అవసరమైతే 12 పేజీల బుక్‌లెట్ ఇచ్చారు. సైన్స్ పరీక్షకు మాత్రం ఫిజిక్స్-కెమిస్ట్రీ జవాబులు రాసేందుకు 12 పేజీల బుక్‌లెట్, బయాలజీకి మరో 12 పేజీల బుక్‌లెట్ విడివిడిగా ఇచ్చారు. గతేడాది ప్రశ్నపత్రాలు వాట్సాప్‌ల్లో వచ్చినందున ఈసారి ఎవరూ పరీక్ష గదుల్లోకి ఫోన్ తీసుకెళ్లకూడదనే రూల్ పెట్టారు. 

ఏప్రిల్ 3 నుంచి 18 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. హాజరైన 6,64,152 మందిలో రెగ్యులర్ విద్యార్థులు 6,09,070 మంది. పరీక్షలు రాసిన వారిలో బాలురు - 3,11,329, బాలికలు- 2,97,741 మంది ఉన్నారు. ఇక సప్లిమెంటరీ విద్యార్థులు 53,410 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరితోపాటు ప్రైవేటు విద్యార్థులు 1524 మంది, ప్రైవేటు సప్లిమెంటరీ విద్యార్థులు 147 మంది పరీక్షలు రాశారు.