అన్వేషించండి

Breaking News Live Telugu Updates: సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

Background

AP Weather Report: అనుకున్నట్టే అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారబోతుందని భారత్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఈ తుపాను పయనించనున్నట్లు వివరించింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్‌పై కూడా పడనున్నట్లు ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. 

పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు 

ఈనెల 8వ తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి - దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం సోమవారం తెలిపింది. ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను... ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుందని తెలిపింది. బుధవారం దక్షిణ కోస్తాలో కొన్ని చోట్లు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరులో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంతి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వివరించింది. 

40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు..

వాయుగుండం, తుపాను ప్రభావంతో ఈనెల 8, 9 తేదీల్లో కోస్తాలో తీరం వెంబడి గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన "మాండూస్" అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. ఈనెల 15వ తేదీన అండమాన్ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం 20వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఏపీ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడంతో అల్ప పీడనాలు ఏపీ తీరంవైపు కదలడం లేదని అంచనా వేస్తున్నారు. 

తెలంగాణ వెదర్ రిపోర్టు ఇలా.. 

తెలంగాణలో మాత్రం వర్షసూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. చలి తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉందన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి - కొత్తగూడెం వంటి తూర్పు తెలంగాణలోని వివిధ ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నగర శివార్లలో విస్తృతంగా దట్టమైన పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా హైవేలపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

20:42 PM (IST)  •  06 Dec 2022

సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

సివిల్స్ మెయిన్ 2022 పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 6న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

Civil Services (Main) Examination, 2022 Results

17:24 PM (IST)  •  06 Dec 2022

ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

ఎమ్మెల్సీ కవితతో 11న సమావేశానికి సిబిఐ అంగీకారం, ఈమెయిల్ ద్వారా రిప్లై

వివరణ కోసం ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో , 11 వ తేదికి  సీబీఐ అంగీకారం

ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చిన సిబిఐ

హైదరాబాద్: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంబంధించిన కేసులో వివరణ కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సమావేశం కావడానికి సిబిఐ అంగీకరించింది. 

వివరణ కోసం ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సిబిఐ కి కవిత లేఖ రాసిన విషయం విధితమే. 

కవిత లేక కు సిబిఐ స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది.

11:04 AM (IST)  •  06 Dec 2022

శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య

శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం మాజీ సర్పంచి, వైసీపీ నేత బరాటం రామశేషు దారుణ హత్యకి గురయ్యారు. వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని నరికి చంపేశారు. ప్రస్తుతం గార వైస్ ఎంపీపీగా ఉన్న ఆయనపై గతంలో కూడా ఒకసారి హత్యాయత్నం జరిగింది. గతంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో మెడపైన తీవ్రంగా గాయపరిచారు. హత్యకు సంబంధించి పోలీసులు వివరాలను తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎందుకు చంపారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో హత్య చేసేందుకు ప్రయత్నించగా అప్పుడు తప్పించుకున్నారని ఈసారి మంచు వల్ల దొరికిపోయారని స్థానికులు చెబుతున్నారు.  తాజాగా ఈ హత్య జిల్లాలో కలకలం రేపింది

08:58 AM (IST)  •  06 Dec 2022

వంశీరామ్‌ బిల్డర్స్‌పై ఐటీ కన్ను- కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు

ఐటీ శాఖ తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొన్నటి మొన్న మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ కన్ను ఇప్పుడు రియల్టర్స్‌పై పడింది. హైదరాబాద్‌లో ఉన్న వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లలో ఈ వేకువ జాము నుంచి ఐటీ సోదాలు జరుగుతన్నాయి. వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget