అన్వేషించండి

AP Politics: టీడీపీ బియ్యం అమ్మడం నేర్పిస్తే, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్రాన్నే అమ్మేస్తోంది- కిరణ్‌ కుమార్ రెడ్డి

AP Politics: రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీకి చెందుతుందన్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని ఫైర్ అయ్యారు. 

AP Politics: చిన్న వయసులోనే సీఎం అయ్యే అదృష్టాన్ని ఆ దేవుడు కల్పిస్తే... పేద ప్రజలకు సాయం చేయాల్సింది పోయి ఇలాగేనా పాలన సాగించేదంటూ ఏపీ సీఎం జగన్‌పై.. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి  ఫైర్ అయ్యారు. ఏపీ సిట్టింగ్ ఎంపీలు హైదారాబాద్‌లో సెటిల్ అవుతామని చెప్పడం దారుణం అన్నారు. గతంలో టీడీపీ వాళ్లు ప్రతిపక్షాలపై దొంగ కేసులు పెడుతూ వేధించే వారని..  అదే వైసీపీ వాళ్లు కూడా నేర్చుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా డాక్టరేట్ కూడా పొందినట్లు పెద్ద ఎత్తున కేసులు పెట్టి వేధిస్తున్నట్లు ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ప్రతీ ఒక్క గ్రామంలో, ప్రతీ ఒక్క నియోజక వర్గంలో ఉన్నాయని అన్నారు. మరీ ఇంత దారుణమైన పాలనను తానెక్కడా చూడలేదన్నారు. మంచి పరిపాలన అందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ.. మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి ఇలా అరాచక పాలన సాగించడం దారుణం అంటూ చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల పాలను సీఎం జగన్ ఏం చేశారో ఆయన చెప్పడం కాదు, ప్రజలే చెప్పాలంటూ కామెంట్లు చేశారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇచ్చే బియ్యాన్ని అమ్ముకునే వాళ్లని వారి తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లు రాష్ట్రాన్నే అమ్మేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. రాజకీయం అనేది సేవ అయితే వైసీపీ నాయకులు దాన్ని వ్యాపారం కింద మార్చేశారని కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మానవ సేవే మాధవ సేవ అంటారని.. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలంతా గుర్తు పెట్టుకుంటున్నారని చెప్పారు. పేద వారికి సేవ చేస్తున్నారు కాబట్టే.. ప్రజలు బీజేపీని అంతగా ప్రేమిస్తున్నారని వివరించారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో ఈ సారి బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget