News
News
X

Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ప్రారంభం - తొలిరోజు ఏం చేయనున్నారంటే?

Global Investors Summit: ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైంది. తొలిరోజున కార్పొరేట్ దిగ్గజాల ప్రసంగాలు, కేంద్రమంత్రి, సీఎం జగన్ స్పీచ్ ఉంటుంది.  

FOLLOW US: 
Share:

Global Investors Summit: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 9.45 గంటలకు అతిథుల ఆహ్వాన, పరిచయ కార్యక్రమం ఉంటుంది. లేజర్ షో, మా తెలుగు తల్లికి గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహార్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం నాఫ్ సీఈఓ సుమిత్ బిదాని, భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ కంట్రీ హెడ్ అండ్ ఎండీ జోష్ ఫాల్గర్, టొరే ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మసహీరో హమగుచి, కియా ఇండియా నుంచి కబ్ డోంగి లీ, జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, ది ఇండియా సిమెంట్స్ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ ప్రసంగిస్తారు. 

అనంతరం ఓ ప్రజెంటేషన్ ఉంటుంది. తర్వాత అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్ పర్సన్ ప్రీతి రెడ్డి, సెంచురీ ఫ్లైబోర్డ్స్ ఛైర్మన్ సజ్జన్ భజంకా, శ్రీ సిమెంట్ ఛైర్మన్ హరి మోహన్ బంగూర్, టెస్లా ఇంక్ కో ఫౌండర్, మాజీ సీఈవో మార్టిన్ ఎబర్ హార్డ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఛైర్మన్ నవీన్ జిందాల్ ప్రసంగం చేస్తారు. తర్వాత జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీఎం. రావు, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్లా,  సయింట్ ఫౌండర్ ఛైర్మన్ బీవీ మోహన్ రెడ్డి, దాల్మియా భారత్ గ్రూపు ఎండీ పునీత్ దాల్మియా, రెను పవర్ సీఎండీ సుమంత్ సిన్హా ప్రసంగిస్తారు. తర్వాత ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అర్జున్న ఒబెరాయ్, అదానీ స్పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ సీఈవో కరణ్ అదానీ, సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కేఎం బిర్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేష్ అంబానీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఎంవోయూ కార్యక్రమం ఉంటుంది. అనంతరం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగం ఉంటుంది. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపన్యాయం చేస్తారు. అనంతరం ప్రముఖులను సన్మానిస్తారు. తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వందన సమర్పణ చేయనున్నారు. అనంతరం ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది.

వివిధ ఆడోటోరియాల్లో వివిధ కార్యక్రమాలు

మధ్యాహ్నం 3 నుంచి నాలుగు ఆడిటోరియాల్లో వివిధ సెషన్స్ జరుగుతాయి. ఆడిటోరియం-1లో ఐటీ, ఆడిటోరియం-2లో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఆడిటోరియం-3లో రెనెవబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఆడిటోరియం-4లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ కంట్రీ సెషన్ జరగనుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆడిటోరియం-1లో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆడిటోరియం-2లో స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఆడిటోరియం-3లో హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఎక్విప్ మెంట్, ఆడిటోరియం-4లో ది నెదర్లాండ్స్ కంట్రీ సెషన్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఆడిటోరియం-1లో ఎలక్ట్రానిక్స్, ఆడిటోరియం-2లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆడిటోరియం-3లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆడిటోరియం-4లో ట్రాన్స్ ఫర్మేటివ్ ఫుడ్ సిస్టమ్స్ పై ప్రత్యేక హైలెవెల్ సెషన్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు కూచిపూడి కళా ప్రదర్శన, 8 గంటలకు డ్రోన్ షోతో తొలిరోజు ముగుస్తుంది.

Published at : 03 Mar 2023 09:31 AM (IST) Tags: AP News Visakha News Global investors summit Global Summit in Visakha Global investors summit First Day

సంబంధిత కథనాలు

ప‌శువైద్యుడు గుర్తించ‌లేకపోయాడు- చాట్‌జీపీటీ పెంపుడు కుక్క ప్రాణాలు కాపాడింది

ప‌శువైద్యుడు గుర్తించ‌లేకపోయాడు- చాట్‌జీపీటీ పెంపుడు కుక్క ప్రాణాలు కాపాడింది

చంద్రుడిపై గాజు గోళాల్లో నీరు - ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డి

చంద్రుడిపై గాజు గోళాల్లో నీరు - ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డి

Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి

Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి

హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్

హైదరాబాద్ మెట్రో విస్తరణ లాభసాటి కాదన్న కేంద్రం యూపీలోని 10 నగరాల్లో నిర్మిస్తోంది: కేటీఆర్

Playground Under flyover: ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్

Playground Under flyover: ఫ్లైఓవర్ల కింద ఆట స్థలాలు - ఆలోచన అదిరిపోయిందంటూ మంత్రి కేటీఆర్ ట్వట్

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన