అన్వేషించండి

AP New Districts: ఏపీలో 26 జిల్లాలపై తుది నోటిఫికేషన్‌ విడుదల - జిల్లాల సమగ్ర వివరాలు ఇవే

Gazette on New Districts at AP: ఏప్రిల్ 4 తేదీ నుంచి ఏపీలో కొత్త జిల్లాలతో పరిపాలనా వికేంద్రీకరణ జరగనుండగా.. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్ విడుదలైంది.

AP New Districts: Final notification on New Districts at AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు (మొత్తం 26 జిల్లాలు)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 4 తేదీ నుంచి ఏపీలో కొత్త జిల్లాలతో పరిపాలనా వికేంద్రీకరణ జరగనుండగా.. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్ విడుదలైంది. భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 తేదీ అపాయింటెడ్ డే గా ఉంటుందని స్పష్టం చేసింది. 26 జిల్లాల ఏర్పాటు, అన్ని జిల్లాలకు కలెక్టర్లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ శనివారం అర్ధరాత్రి జారీ చేసింది. కొత్త జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాలను పూర్తి వివరాలు తెలుపుతూ ఏపీ సర్కార్ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 

తుది నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

1) జిల్లా పేరు: శ్రీకాకుళం              జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
నియోజకవర్గాలు: 8 (ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16), పలాస డివిజన్ (కొత్తది)
మండలాలు: 30
వైశాల్యం: 4,591 చ.కి.మీ
జనాభా: 21.91 లక్షలు

2) జిల్లా పేరు: విజయనగరం             జిల్లా కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా బొబ్బిలి(11), విజయనగరం(15), కొత్తగా చీపురుపల్లి
మండలాలు: 27
వైశాల్యం : 3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు

3) జిల్లా పేరు: మన్యం           జిల్లా కేంద్రం: పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6), పార్వతీపురం(8)
మండలాలు: 14
వైశాల్యం: 3,935 చ.కి.మీ
జనాభా: 9.72లక్షలు

4) జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు            జిల్లా కేంద్రం: పాడేరు
నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు, రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: పాడేరు(11), రంపచోడవరం(11)
మండలాలు: 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు

5) జిల్లా పేరు: విశాఖపట్నం జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు:కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(6)
మండలాలు: 11
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు

6) జిల్లా పేరు: అనకాపల్లి           జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10), అనకాపల్లి(14)
మండలాలు: 24
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు

7) జిల్లా పేరు: కాకినాడ        జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12), కాకినాడ(9)
మండలాలు: 21
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు

8) జిల్లా పేరు: కోనసీమ               జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తగా కొత్తపేట
మండలాలు: 22
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు

9) జిల్లా పేరు: తూర్పుగోదావరి                  జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(9)
మండలాలు: 19
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు

10) జిల్లా పేరు: పశ్చిమ గోదావరి              జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11)
మండలాలు: 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు

11) జిల్లా పేరు: ఏలూరు              జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు
మండలాలు: 28
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు

12) జిల్లా పేరు: కృష్ణా           జిల్లా కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12), కొత్తగా ఉయ్యురు
మండలాలు: 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు

13) జిల్లా పేరు: ఎన్టీఆర్‌ జిల్లా                    జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7)
మండలాలు: 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు

14) జిల్లా పేరు: గుంటూరు                   జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8)
మండలాలు: 18
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు

15) జిల్లా పేరు: బాపట్ల                     జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : బాపట్ల(12), కొత్తగా చీరాల (13)
మండలాలు: 25
వైశాల్యం: 3,829 చ.కి.మీ
జనాభా: 15.87 లక్షలు

16) జిల్లా పేరు: పల్నాడు                     జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు: గురజాల (14), నరసరావుపేట(14), కొత్తగా సత్తెనపల్లి డివిజన్
మండలాలు: 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు

17) జిల్లా పేరు: ప్రకాశం                 జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు: 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13)
మండలాలు: 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు

18) జిల్లా పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు              జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు (కొత్తది)
మండలాలు: 38
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు

19) జిల్లా పేరు: కర్నూలు                 జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) కొత్తగా పత్తికొండ డివిజన్
మండలాలు: 26
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు

20) జిల్లా పేరు: నంద్యాల           జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10)
మండలాలు: 29
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు

21) జిల్లా పేరు: అనంతపురం        జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం, అనంతపురం, కొత్తగా గుంతకల్‌
మండలాలు: 31
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు

22) జిల్లా పేరు: శ్రీసత్యసాయి             జిల్లా కేంద్రం: పుట్టపర్తి
నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం (4) పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8)
మండలాలు: 32
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు

23) జిల్లా పేరు: వైఎస్సార్‌ కడప             జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు (12) బద్వేలు (12)
మండలాలు 36
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు

24) జిల్లా పేరు: అన్నమయ్య                జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11)
మండలాలు: 30
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు

25) జిల్లా పేరు: చిత్తూరు                   జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు (15) కొత్తగా కుప్పం, కొత్తగా నగరి
మండలాలు: 31
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు

26) జిల్లా పేరు: తిరుపతి              జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, కొత్తగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్.
మండలాలు: 34
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు

Also Read: New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటులో మరో ముందడుగు- కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?

వీడియోలు

మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
Harish Rao Challenges Revanth Reddy: రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డికి బండ కట్టి రంగనాయక సాగర్‌లో పడేస్తా - హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Malavika Mohanan: ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
ఫోటోగ్రాఫర్‌గా మారిన రాజా సాబ్ హీరోయిన్... టైగర్ సఫారీలో మాళవికా మోహనన్
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
త్వరలో మార్కెట్లోకి కొత్త Skoda Kushaq.. పనోరమిక్ సన్‌రూఫ్ సహా లెవెల్-2 ADAS ఫీచర్లు
త్వరలో మార్కెట్లోకి కొత్త Skoda Kushaq.. పనోరమిక్ సన్‌రూఫ్ సహా లెవెల్-2 ADAS ఫీచర్లు
Embed widget