YS Jagan Birthday: సీఎం నివాసంలో జగన్ బర్త్‌డే వేడుకలు - కేక్ కట్ చేయించిన మంత్రులు- ప్రముఖుల శుభాకాంక్షలు
YS Jagan Birthday: సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసం వద్దకు చేరుకున్న పలువురు మంత్రులు ఆయనతో కేట్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
YS Jagan Birthday: ఏపీ సీఎం జగన్ 50వ పుట్టిన రోజు వేడకలు ఘనంగా జరిగాయి. ఆయన నివాసానికి చేరుకున్న పలువురు మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు.. ముఖ్యమంత్రితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ తినిపించారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, తానేటి వనిత, ఆర్కే రోజా, విడదల రజిని, జోగి రమేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, బాలశౌరి, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ అజేయ కల్లాం, ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్ పి సిసోడియా, సమాచారశాఖ కమిషనర్ టి విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
♦ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) December 21, 2022
♦రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, విడదల రజని, రోజా, జోగి రమేష్, ఎంపీ బాలశౌరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి తదితరుల సమక్షంలో ముఖ్యమంత్రి కేక్ కట్ చేశారు. pic.twitter.com/WN6biFj9mT
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు ఫోన్ చేసి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రి జగన్ కు టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి దంపతులు.. వేంకటేశ్వర స్వామి ప్రసాదాలు అందించారు. అలాగే పాస్టర్ జాన్ వెస్లీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సినీ సెలబ్రిటీలు అక్కినేని నాగార్జున, విశాల్, హరిశంకర్, బండ్ల గణేష్, కోనా వెంకట్, పీవీపీ, బీవీఎస్ రవి తమ శుభాకాంక్షలు తెలిపారు.
Wishing dear @ysjagan garu a very happy birthday!!May you be blessed with health and happiness always!!💐 #HBDYSJagan
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 21, 2022
రాజకీయ ప్రముఖుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ లీడర్ విష్ణువర్దన్ రెడ్డి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
Birthday greetings to @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2022