అన్వేషించండి

Free Tabs to AP Students: విద్యార్ధులు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్‌లు-ఏపీలో సీఎం జగన్ కానుక

పేద విద్యార్ధులను గ్లోబల్‌ సిటిజెన్లుగా తీర్చిదిద్దేలా, పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా... 8వ తరగతి విద్యార్థులకు ఏటా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక అందించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్పొరేట్‌ విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యార్థులకు ఈ ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడేలా ఇప్పటి నుంచే వారికి శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు,  59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు ఉచితంగా అందిస్తారు. 

పేద విద్యార్ధులను గ్లోబల్‌ సిటిజెన్‌లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్ధమయ్యేలా... ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ఇకపై ప్రతి ఏటా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేయనున్నారు. రూ. 16,500 కు పైగా మార్కెట్‌ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి అందిస్తారు.  ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. 4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్‌ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్ లు పంపీణీ చేస్తారు. 

బైజూస్‌ కంటెంట్‌తో అందిస్తున్న ట్యాబ్‌ ప్రత్యేకతలు


– ఇంటర్నెట్‌ సౌకర్యం లేని విద్యార్ధులకు ఆఫ్‌ లైన్‌లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా 24/7 పాఠాలు అందుబాటులో ఉండేలా, 8,9 తరగతుల కంటెంట్‌ మెమరీ కార్డు ద్వారా ట్యాబ్‌లలో ప్రీలోడ్‌ చేశారు. 

– బైజూస్‌ ప్రీమియం యాప్‌ ద్వారా విద్యార్ధులకు మాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియాలజీ, సివిక్స్‌ సబ్జెక్ట్‌లలో అభ్యసన సులువుగా ఉండేలా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉచిత ఈ–కంటెంట్‌. ప్రతి చాప్టర్‌ను కాన్సెప్ట్‌లుగా విభజించి 67 చాప్టర్లు, 472 కాన్సెప్ట్‌లపై 300 వీడియోలు, 168 సాల్వ్‌డ్‌ క్వశ్చన్‌ బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. 

– పిల్లలకు సులభంగా పాఠాలు అర్ధమయ్యేలా టెక్ట్స్‌ రూపంలో మాత్రమే కాకుండా మంచి చిత్రాలు, వీడియో, ఆడియో, త్రీ డైమెన్షన్‌ (త్రీడీ) ఫార్ములాలో యానిమేషన్లతో కంటెంట్ రూపొందించారు. 

– పిల్లలు తమ స్థాయిని స్వయంగా అంచనా వేసుకునేలా అసెస్‌మెంట్‌ విధానం, ప్రతి చాప్టర్‌ తర్వాత 40–50 ప్రశ్నలు, వివిధ గ్రేడ్లలో మాక్‌ టెస్టులు. 

–  ట్యాబ్‌లలో అవాంఛనీయ సైట్లు, యాప్స్‌ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్‌ వేర్ ఇన్ స్టాల్ చేశారు. 

-3 ఏళ్ల పాటు వారంటీ, ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో ఇస్తే వారంలో వారు రిపేర్‌ చేసైనా లేదా మార్చి వేరేదైనా ఇస్తారు. 

– ఈ జూన్‌ కల్లా నాడు – నేడు ఫేజ్‌ 1 లో పూర్తయిన 15,634 స్కూల్స్‌లోని 6 వ తరగతి పైన 30,032 క్లాస్‌ రూమ్స్‌లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ (డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డుల ద్వారా చదువులు), ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్ళలో స్మార్ట్‌ టీవీల ఏర్పాటు దిశగా అడుగులు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Electric Wires Falling Down Baby Incident | అల్లవరం మండలంలో ప్రాణాలకే ప్రమాదంగా మారిన విద్యుత్ వైర్లు | ABP DesamGautam Adani Maha Kumbh Mela 2025 | ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న అదానీ | ABP DesamJawan Karthik Passed Away | కశ్మీర్ లో ఉగ్రదాడి...కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి | ABP DesamSaif Ali Khan Discharged From Hospital | ఐదురోజుల తర్వాత ఇంటికి వచ్చిన సైఫ్ అలీఖాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Davos Tour: దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం - తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు దిగ్గజ సంస్థ యూనిలీవర్ అంగీకారం
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Janasena: 'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు
Viral News: చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
చిన్నప్పుడు అమ్మా,నాన్న ఆటాడారు - 20 ఏళ్ల తర్వాత నిజంగానే భార్యభర్తలయ్యారు - ఇదో క్యూట్ లవ్ స్టోరీ
Chandrababu Speech: హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం, పీ4 మోడల్‌తో మరిన్ని అద్భుతాలకు రెడీ: దావోస్‌లో చంద్రబాబు
Viral News: ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
ఈమె లక్కీ స్టార్ - 4 కోట్ల ఆస్తి రాశారు అని ఫోన్ వస్తే సైబర్ స్కామ్ అనుకుంది - కానీ నిజమే !
Embed widget