Top Headlines Today: మళ్లీ సోమవారం పోలవరం, 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు - నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ ఘాటు లేఖ
AP Telangana Latest News 15 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
Andhra Pradesh News Today | జగన్‌కు గ్రేటర్ అధికారుల షాక్ - ఇంట్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. లోటస్ పాండ్‌లో జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ గదులను కూల్చివేశారు. జూబ్లిహిల్స్ లోని లోటస్ పాండ్‌లో జగన్ ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు విశాలమైన ఫుట్ పాత్ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటి ముందు ఫుట్ పాత్ ను ఆక్రమించి సెక్యూరిటీ రూములు నిర్మించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పుంగనూరులో ఉద్రిక్తత - పర్యటన రద్దు చేసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక పాత్ర నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన తొలి సారి నియోజకవర్గంలో పర్యటించాలని అనుకున్నారు. ఈ మేరకు అనుచరులు ఏర్పాట్లు చేశారు. శనివారం ఆయన పుంగనూరు రావాల్సి ఉంది. కానీ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు -20 జిల్లాల కలెక్టర్ల మార్పు
తెలంగాణలో భారీగా మరోసారి ఐఎస్‌ఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈసారి కొందరు కలెక్టర్లకి కూడాస్థాన చలనం కలిగించింది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకు తెలంగామలో జిల్లాకలెక్టర్లను మారుస్తూ ఆదేశాలు వచ్చాయి. సుమారు 20 జిల్లాల కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఖమ్మం జిల్లా ముజామిల్ ఖాన్ (పెద్దపల్లి కలెక్టర్), నాగర్‌కర్నూలు బడావత్ సంతోష్(మంచిర్యాల కలెక్టర్), రాజన్న సిరిసిల్ల సందీప్ కుమార్ ఝా( టాన్స్‌కో జేఎండీ), కరీంనగర్ జిల్లా అనురాగ్ జయంతి( సిరిసిల్ల కలెక్టర్), వరంగల్ జిల్లా సత్య శారద దేవి (జాయింట్ సెక్రటరీ), వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్( ఐటీడీఏ పీవో )లను నియమించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మళ్లీ సోమవారం పోలవరం- వంద రోజుల్లో అన్న క్యాంటీన్లు- సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో చేపట్టిన సోమవరం పోలవరంను పునరుద్ధరించారు. ఇకపై పోలవరం ప్రాజెక్టుపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా పోలవరంలో జరుగుతున్న జరిగిన పనులపై నేరుగా పరిశీలించిన తర్వాత ఇకపై వారం వారం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో మాట్లాడాలని నిర్ణయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
విచారణ కాక ముందే తీర్పు చెప్పేస్తారా? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ ఘాటు లేఖ
విద్యుత్ కొనుగోలు విషయంలో వస్తున్న ఆరోపణలు,జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు. అందులో ఈ అంశాలు ఉన్నాయి. ఆ లెటర్ పూర్తి సారాంశం ఇలా ఉంది. "రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్తు రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. ఏ ఒక్క సెక్టారు కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేది. పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్తు అవసరాల దృష్ట్యా విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఎంతమాత్రం సరిపోదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి