Jagan house Demolition : జగన్‌కు గ్రేటర్ అధికారుల షాక్ - ఇంట్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
Jagan House : లోటస్ పాండ్‌లో జగన్ ఇంటి ముందు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫుట్ పాత్ ఆక్రమించి సెక్యూరిటీ రూములు నిర్మించారు.
Jagan House in Lotus Pond is demolished by GHMC : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. లోటస్ పాండ్‌లో జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ గదులను కూల్చివేశారు. జూబ్లిహిల్స్ లోని లోటస్ పాండ్‌లో జగన్ ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందు విశాలమైన ఫుట్ పాత్ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటి ముందు ఫుట్ పాత్ ను ఆక్రమించి సెక్యూరిటీ రూములు నిర్మించారు.
జగన్ తాడేపల్లిలో ఉంటున్నా లోటస్ పాండ్ ఇంటికి ఏపీ పోలీసుల భద్రత
గత ఐదేళ్లుగా జగన్ తాడేపల్లిలో ఉంటున్నారు. లోటస్ పాండ్‌లో ఉండటం లేదు. అయినప్పటికీ ఏపీలో సీఎం .. తెలంగాణ ఇంటికి ఏపీ పోలీసులు భద్రత కల్పించారు. ఇంటి బయట సెక్యూరిటీ రూములు నిర్మింప చేసుకుని అక్కడే ఉన్నారు. ఈ నిర్మాణాలపై స్థానికులు పదే పదే గ్రేటర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు లోటస్ పాండ్ వ్యక్తుల దృష్టికి తీసుకు వచ్చినా తొలగించలేదు. దీంతో శుక్రవారం సాయంత్రం.. తాము ఆ అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం.. ఆక్రమణల తొలగింపు బృందం వచ్చి పని పూర్తి చేసింది.
లింక్డ్ ఇన్‌లో రెస్యూమ్ అప్‌డేట్ చేసిన చంద్రబాబు, ఇంటర్నెట్‌లో ఈ రియాక్షన్ చూశారా?
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇల్లు
లోటస్ పాండ్‌లో జగన్ నివాసం అధికారింగా ఆయన పేరు మీద ఉండదు. కొన్ని కంపెనీల పేరు మీద ఉంటుంది. ఆ కంపెనీల్లో మెజార్టీ షేర్లు జగన్ కుటుంబం చేతుల్లో ఉన్నాయి. ఆ రకంగా ఇల్లు జగన్ సొంత ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆ ఇల్లు కూడా జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఉంది. క్విడ్ ప్రో కో ద్వారా ఆ ఇల్లు సంపాదించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈడీ జప్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ అధికారులు అక్రమంగా నిర్మించిన సెక్యూరిటీ పోస్టులు తొలగించడంపై వైసీపీ వర్గాలు ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
డిప్యూటీ సీఎం అధికారాలేమిటి ? ఎలాంటి ప్రోటోకాల్ లభిస్తుంది ?
త్వరలో మళ్లీ లోటస్‌పాండ్‌లో నివాసం ఉండే అవకాశం
ఏపీ ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన తర్వలోనే మళ్లీ లోటస్ పాండ్‌కో .. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో మకాం మారుస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తాడేపల్లి నివాసానికే పార్టీ కార్యాలయాన్ని మార్చుకుని అక్కడే తాజా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలో మొదటి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఆయన ఏపీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచే రాజకీయాలు చేశారు. ఈ సారి కూడా అదే చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.