News
News
X

Anurag Thakur: పెగాసస్‌ ఫోన్‌లో కాదు ఆయన బ్రెయిన్‌లో ఉంది, రాహుల్‌పై కేంద్రమంత్రి సెటైర్

Anurag Thakur: పెగాసస్ రాహుల్ ఫోన్‌లో లేదని, ఆయన మెదడులోనే ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

FOLLOW US: 
Share:

Anurag Thakur Fires on Rahul Gandhi: 

కేంబ్రిడ్జ్‌లో రాహుల్..

రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. ప్రధాని మోదీ పాలనలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలందరిపైనా గుట్టుగా నిఘా పెడుతున్నారంటూ పెగాసస్‌ కేసుని ప్రస్తావించారు. దేశం అన్వయించుకోడానికి వీల్లేని విధానాలు బలవంతంగా రుద్దుతున్నారంటూ మండి పడ్డారు. పెగాసస్‌ గురించి చెబుతూ తన  ఫోన్‌లోనూ పెగాసస్ వైరస్ ఉందని, ఇదే విషయం అధికారులు చెప్పారని అన్నారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"నిన్నటి ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో రాహుల్ గాంధీకి ముందే తెలుసు. కాంగ్రెస్‌ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పెగాసస్ ఆయన ఫోన్‌లో కాదు. ఆయన మెదడులోనే ఉంది. బహుశా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఏం చెప్పిందో రాహుల్ విన్నట్టు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రధాని మోదీని గౌరవిస్తున్నారని చెప్పారు. తన మొబైల్‌లో పెగాసస్ ఉందన్న అనుమానం ఉన్నప్పుడు అది ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు. విదేశాల్లోనే ఉన్న స్నేహితులతో  చేతులు కలిపి దేశ పరువుని దిగజార్చేలా మాట్లాడుతున్నారు"

అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించీ ప్రస్తావించారు అనురాగ్ ఠాకూర్. ప్రజలందరూ ప్రధాని మోదీని అభిమానిస్తున్నారని, అందుకే బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ సొంతమని అన్నారు. భారత మీడియాను కూడా రాహుల్ గాంధీ కించపరుస్తున్నారని మండి పడ్డారు. 

ఇదీ కేసు..

పెగాసస్‌ స్పైవేర్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అది పెగాసస్‌ మాల్‌వేర్ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చాలా స్పష్టంగా చెప్పింది. టెక్నికల్ టీమ్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. అదే సమయంలో కేంద్రం ఈ విచారణలో కమిటీకి సరిగా సహకరించలేదనీ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు దీనిపైనే భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు. "కేంద్రం కమిటీకి సహకరించలేదంటే, ఏదో నిజాన్ని దాస్తున్నట్టే కదా" అని ట్వీట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అణిచివేయటమే అంటూ ప్రధాని మోదీ, భాజపాపై మండిపడ్డారు. అటు భాజపా కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగుతోంది. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తోందని, ప్రధాని మోదీ చరిష్మాను దెబ్బ తీయాలని చూస్తోందని విమర్శిస్తోంది. సీనియర్ భాజపా నేత రవి శంకర్ ప్రసాద్...రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆ 5 మొబైల్స్‌లో ఏ మాల్‌వేర్ ఉందో తేలిన తరవాత, భాజపా ఈ పని చేసిందో లేదో కచ్చితంగా తెలుస్తుందని..అప్పుడు కాంగ్రెస్ తప్పకుండా క్షమాపణ చెప్పాల్సి వస్తుందని మండిపడ్డారు. 

Also Read: Elon Musk puja: అందరికీ ఫ్యాన్స్ ఉంటే మస్క్‌కు మాత్రం భక్తులుంటారు, ప్రూఫ్ కావాలా? ఈ వీడియో చూడండి

Published at : 03 Mar 2023 11:46 AM (IST) Tags: Pegasus Pegasus Case Rahul Gandhi Anurag Thakur

సంబంధిత కథనాలు

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం

Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

CM KCRకు బండి సంజయ్ లేఖ-  విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్