Anurag thakur Slams NYT: మీరా మాకు డెమొక్రసీ పాఠాలు నేర్పేది? విదేశీ మీడియాపై కేంద్రమంత్రి ఫైర్
Anurag thakur Slams NYT: న్యూయార్క్ టైమ్స్‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anurag thakur Slams Foriegn Media:
న్యూయార్క్ టైమ్స్‌పై ఆగ్రహం..
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విదేశీ మీడియాపై మండి పడ్డారు. New York Times సహా పలు సంస్థలు భారత్‌పై, ప్రధాని నరేంద్ర మోదీపై బురదజల్లుతున్నాయంటూ తీవ్రంగా విమర్శించారు. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. భారత దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కుట్రు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛపై న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనాన్ని ఖండించారు. భారత్‌కు సంబంధించి ఏ వార్తనైనా సరే ఈ మీడియా సంస్థ ఎలాంటి ఆలోచన లేకుండా ప్రచురిస్తోందన్న అనురాగ్ ఠాకూర్..దేశ ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోదీపై దుష్ప్రచారాలు ఏంటని ప్రశ్నించారు.
"కొన్ని విదేశీ మీడియా సంస్థలు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీపైనా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంపై దాడి చేస్తున్నాయి. భారత్‌లో పౌరుల ప్రాథమిక హక్కులకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో పత్రికా స్వేచ్ఛకూ అంతే ప్రాధాన్యత ఉంది. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే మా దేశానికి మీరు డెమొక్రసీ పాఠాలు చెప్పాల్సిన పని లేదు. మీ అజెండా ఏటో అర్థమవుతోంది. కశ్మీర్ గురించి రాసిన ఆర్టికల్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మీడియాను భారత్ సహించదు"
- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
New York Times had long back dropped all pretensions of neutrality while publishing anything about India. NYT's so called opinion piece on freedom of press in Kashmir is mischievous & fictitious published w/ a sole motive to spread a propaganda about India…
— Anurag Thakur (@ianuragthakur) March 10, 2023
1/n
Democracy in India and We the people are very matured and we don't need to learn grammar of democracy from such agenda driven media. Blatant lies spread by NYT abt press freedom in Kashmir is condemnable.
— Anurag Thakur (@ianuragthakur) March 10, 2023
Indians will not allow such mindsets to run their decisive agenda on India soil.
— Anurag Thakur (@ianuragthakur) March 10, 2023
రాహుల్‌పైనా ఫైర్..
రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకు పడ్డారు. ప్రధాని మోదీ పాలనలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలందరిపైనా గుట్టుగా నిఘా పెడుతున్నారంటూ పెగాసస్ కేసుని ప్రస్తావించారు. దేశం అన్వయించుకోడానికి వీల్లేని విధానాలు బలవంతంగా రుద్దుతున్నారంటూ మండి పడ్డారు. పెగాసస్ గురించి చెబుతూ తన ఫోన్లోనూ పెగాసస్ వైరస్ ఉందని, ఇదే విషయం అధికారులు చెప్పారని అన్నారు. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నిన్నటి ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో రాహుల్ గాంధీకి ముందే తెలుసు. కాంగ్రెస్‌ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. పెగాసస్ ఆయన ఫోన్లో కాదు. ఆయన మెదడులోనే ఉంది. బహుశా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఏం చెప్పిందో రాహుల్ విన్నట్టు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రధాని మోదీని గౌరవిస్తున్నారని చెప్పారు. తన మొబైల్లో పెగాసస్ ఉందన్న అనుమానం ఉన్నప్పుడు అది ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు. విదేశాల్లోనే ఉన్న స్నేహితులతో చేతులు కలిపి దేశ పరువుని దిగజార్చేలా మాట్లాడుతున్నారు"
అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
Also Read: H3N2 Influenza Deaths: దేశంలో ఇన్ఫ్లుయెంజా కలకలం, ఇద్దరు మృతి - అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు