అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Breaking News Live Telugu Updates: అధిష్ఠానం లెక్కలు వేరు- నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు

Latest Telugu News In Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: అధిష్ఠానం లెక్కలు వేరు- నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు

Background

Andhra Pradesh Latest News And Telangana Latest News : ఘట్‌కేసర్‌లో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను పూర్తిగా గంజాయికి బానిస అయిపోయాడు. ప్రభుత్వం మారిన తర్వాత నిఘా పెరగడంతో గంజాయి సరఫరా ఆగిపోయింది. దీంతో గంజాయి దొరకడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్‌లోనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

రాజీనామా చేస్తాను: కేశినేని నాని 

బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పదవికి, టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి అనంతరం  తెలుగు దేశం పార్టీ నుంచి కూడా బయటకు వస్తానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. దానితో విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.

గత మూడు రోజులుగా హాట్ టాపిక్ గా కేశినేని నాని ఎపిసోడ్
2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచీ పార్టీపై పలు సందర్భాల్లో  తన అసంతృప్తిని బయట పెట్టిన కేశినేని నానిది ఎప్పుడూ ముక్కుసూటి వ్యవహారమే. అయితే గత కొన్ని రోజులుగా ఆయనకు విజయవాడ ఎంపీ సీటు మరోసారి దక్కదు అనే ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్టుగానే టీడీపీలో నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ప్రాధాన్యత లభించడాన్ని నాని పలు సందర్భాల్లో విమర్శిస్తూ  వచ్చారు. అయితే ఆదివారం తిరువూరు లో చంద్రబాబు బహిరంగ సభ జరుపనున్నారు. దానికి సంబంధించిన సన్నాహక సదస్సులో కేశినేని నాని ఫొటో లేకపోవడంతో నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య  కొట్లాట జరిగింది. దీనిలో బందోబస్తుకు వెళ్ళిన పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి. వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు తన రాయబారులుగా కొనికళ్ళ నారాయణ లాంటి కీలక నేతల్ని నాని వద్దకు పంపించి తిరువూరు సభకు దూరంగా ఉండమని చెప్పినట్టు నాని తెలిపారు.

విజయవాడ ఎంపీ సీటు కూడా వచ్చే ఎన్నికల్లో తనకు ఇవ్వరని చెప్పినట్టు నాని ప్రకటించారు. ఇదే విషయమై నిన్న మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి తాను విధేయుడిగా ఉంటానని అన్నారు. అయితే ఒకరోజు గడిచే లోపులోనే తాను పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ ప్రకటన కు ముందు కేశినేని నానీ తన వర్గీయులు...అభిమానులతో కీలక చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. దీనితో నాని వ్యూహం ఏంటి... ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనేదానిపై రాజకీయ వర్గాల్లోనే కాకుండా విజయవాడ ప్రజల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది.

7 రోజుల్లో కోటి అప్లికేషన్లు

తెలంగాణలో ఆరు గ్యారంటీల కోసం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రారంభమైన తొలి రోజు నుంచే జనాల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. డిసెంబల్‌ 28 నుంచి ప్రజాపాలన కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటీ 8 లక్షల 94వేల 115 ప్రజాపాలన దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో ఆరు గ్యారంటీల కోసం 93లక్షల 38వేల111 అప్లికేషన్‌లు వచ్చాయి. 15,55, 704 దరఖాస్తులు ఇతర అంశాలపై అర్జీలుగా అధికారులు తెలిపారు. చివరి రోజు కావడంతో శనివారం మరిన్ని దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ప్రతిగ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం

నాలుగు నెలలకోసారి ప్రజాపాలన

అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు మరిన్ని ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నాలుగు నెలలకోసారి నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామసభల్లో దరఖాస్తు ఇచ్చేందుకు వీలు పడని వాళ్లు స్థానిక తహసీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీస్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

12:39 PM (IST)  •  06 Jan 2024

అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం- ఆరు నెలల పాటు ఆందోళనలు నిషేధం

అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగం- ఆరు నెలల పాటు ఆందోళనలు నిషేధం 

12:33 PM (IST)  •  06 Jan 2024

అధిష్ఠానం లెక్కలు వేరు- నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు

నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి నరసరావుపేట నుంచి పోటీ చేయట్లేదన్న ఆయన గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేదన్నారు. అధిష్ఠానం మాత్రం గుంటూరు నుంచి పోటీ చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తనకు అలాంటి ఆలోచన కూడా లేదన్నారు. అధిష్ఠానం లెక్కలు వేరు తన ఆలోచనలు వేరు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Embed widget