అన్వేషించండి

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Background

భాగ్యనగరం హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. వేకువ జామునే ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభించారు. వినాయకుడి శోభాయాత్రలు జరిగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం  ఉదయం 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ప్రధాన శోభాయాత్రతో పాటు, ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది.
చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద వాహనాలను డైవెర్ట్ చేశారు.
కర్బలా మైదానం, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట కూడలి వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌ బండ్‌పైకి అనుమతి ఉండదు. సికింద్రాబాద్‌లో సీటీవో, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, ఘాన్స్ మండీ వద్ద వాహనాల మళ్లిస్తున్నారు. 
టోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ కూడలి, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని అజంతా గేట్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద వాహనాల మళ్లించారు. 
చాపెల్ రోడ్డు, జీపీవో గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రి, స్కైలైన్ రోడ్డు ప్రవేశం, దోమల్ గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడలి, బూర్గుల రామకృష్ణా రావు భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్, ఖైరతాబాద్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ జంక్షన్, కవాడిగూడ కూడలి, ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం, ఇందిరాపార్క్ జంక్షన్ వద్ద వాహనాల డైవర్ట్ చేస్తన్నారు. 
హైదరాబాద్‌ పాతబస్తీలో కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజి వద్ద వాహనాల మళ్లిస్తున్నారు. 
నిమజ్జనం చేశాక ఎలా వెళ్లాలంటే
ఎన్టీఆర్ మార్గ్‌లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత నిర్వాహకులు ఖాళీ వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ మీదుగా తీసుకెళ్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం చేసిన వారు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్తున్నాయి. బైబిల్ హౌజ్ రైల్ ఓవర్ బ్రిడ్డి మీదుగా లారీలను అనుమతించడం లేదు. 
 
ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలు
ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనాలను చూసేందుకు వచ్చే వారి కోసం సాగర్ చుట్టూ ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రమే వాహనదారులు వాహనాలు నిలిపేలా చూస్తున్నారు. ఖైరతాబాద్ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయం దారి, బుద్ధ భవన్ వెనక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్‌లో పోలీసులు  పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

నిమజ్జనం రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్‌కు కొద్ది దూరంలోనే సిటీ బస్సులను నిలిపివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం బస్సులను మాసాబ్ ట్యాంక్, కూకట్‌పల్లి బస్సులు ఖైరతాబాద్ చౌరస్తా, సికింద్రాబాద్ బస్సులు సీటీవో, ప్లాజా, ఎస్ బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఉప్పల్ బస్సులు రామంతాపూర్ టీవీ స్టూడియో, దిల్ సుఖ్ నగర్ బస్సులు గడ్డి అన్నారం, చాదర్ ఘాట్, రాజేంద్రనగర్ బస్సులు దానమ్మ హట్స్, మిదాని బస్సులు ఐఎస్ సదన్, అంతర్ నగర బస్సులు నారాయణ గూడ వైఎంసీఏ వద్ద నిలిపేస్తున్నారు. 

ఓఆర్ఆర్ మీదుగా ప్రైవేటు బస్సులు
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్‌ఆర్‌తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు, అలాగే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు నగరంలోకి అనుమతించడం లేదు. జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులను సైతం వివిధ ప్రాంతాలకు మళ్లించనున్నారు. రాజీవ్ రహదారి, ఎన్‌హెచ్‌ 7 వైపు నుంచి వచ్చే వాహనాలు జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్ చౌరస్తా, తార్నాక, జామై ఉస్మానియా ఫ్లైఓవర్, నింబోలి అడ్డా, చాదర్ ఘాట్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు

09:21 AM (IST)  •  28 Sep 2023

1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ

రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లలోని వినాయక మండపంలోని లడ్డు 1.26 కోట్లు పలికింది..

09:15 AM (IST)  •  28 Sep 2023

బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

ఇంత వరకు బాలాపూర్‌ లడ్డూనే ఏడాదికేడాది రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు అంతకు మించిన అన్నట్టు హైదరాబాద్‌లోని రిచ్మండ్‌లో ఏర్పాటు చేసిన గణేషుడి లడ్డూ వండర్‌ సృష్టించింది. కోటిరూపాయలకు పైగా ధరపలికి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.  

07:06 AM (IST)  •  28 Sep 2023

కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ రేవంత్ రెడ్డి

టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలతో సంచలనం రేపిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పొంగులేటి అనుచరుడిగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మనోహర్ రెడ్డి ఇప్పుడు ఎటు వైపు వెళ్తారు అనేది వేచి చూడాలి.

Image

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget