(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: దసరా నుంచి విశాఖలోనే పాలన- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి- మంత్రులకు స్పష్టం చేసిన జగన్
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు
LIVE
Background
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కాసేపట్లో అమరావతిలో జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 21 నుంచి ఐదురోజులపాటు ఈ సమావేశాలు జరుగతాయి. ఐదు రోజులుపాటే జరుగుతాయా మరికొన్ని రోజులు పొడిగించాలా అనేదానిపై కూడా కేబినెట్‌లో చర్చిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు మొదలవ్వనున్నాయి. అయిదు రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది.
మార్పుల అనంతరం వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ఏపీ సర్కారు ప్రవేశపెట్టనుంది. బిల్లులతో పాటు కీలకాంశాలపై ప్రస్తావన సభలో వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం విశాఖకు తరలి వెళ్లే అంశంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైఎస్సార్సీఎల్పీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో అపాయింట్ మెంట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. . ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంట్ సమవేశాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఇంకా అపాయింట్మెంట్లు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ... అపాయింట్ మెంట్లు దొరికితే వెళ్లి వచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.
నా సీటు పోయినా ఫర్వాలేదు- మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావాలే: కేటీఆర్
మాదాపూర్‌లో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సీటు పోయినా ఫర్వాలేదు కానీ మహిళా రిజర్వేషన్ మాత్రం అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు.
తిరుమలగిరి రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి
యాదాద్రి జిల్లా మోత్కూరు తిరుమలగిరి రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి. పలువురికి గాయాలు
దసరా నుంచి విశాఖలోనే పాలన- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి- మంత్రులకు స్పష్టం చేసిన జగన్
కేబినెట్ భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగుతుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అంతా సిద్ధంగా ఉండాలని కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.
స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి
స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందాడు. ఉప్పలపాడు వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను బస్సును పక్కకు ఆపి చనిపోయాడు. బస్సును ఆపడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.
స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి
స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందాడు. ఉప్పలపాడు వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను బస్సును పక్కకు ఆపి చనిపోయాడు. బస్సును ఆపడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.