అన్వేషించండి

Breaking News Live Telugu Updates: కేంద్ర మంత్రి అమిత్ షాతో పీవీ సింధు భేటీ

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు

Key Events
Andhra Pradesh Telangana Telugu Breaking News Live Updates 16 September 2023 Breaking News Live Telugu Updates: కేంద్ర మంత్రి అమిత్ షాతో పీవీ సింధు భేటీ
ప్రతీకాత్మక చిత్రం

Background

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మరోసారి అభిమానుల మీద తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఫ్యాన్స్ గురించి ఆయన మాట్లాడిన ఒక్కో మాట గుండె లోతుల్లోంచి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన దుబాయ్ (Dubai)లో ఉన్నారు. సైమా 2023 (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. 'సైమా'లో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పురస్కార వేడుకకు ఆయన కళ తీసుకు వచ్చారు. సైమా 2023లో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. 

నేను కింద పడ్డప్పుడు పైకి లేపారు : ఎన్టీఆర్
ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు. ''మళ్ళీ మళ్ళీ నన్ను నమ్మిన నా జక్కన్నకు థాంక్స్'' అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్'లో తనతో పాటు నటించిన రామ్ చరణ్ (Ram Charan)కు కూడా థాంక్స్ చెప్పారు. అతడిని బ్రదర్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  

''అభిమానులు అందరికీ థాంక్యూ. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా భాద పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు'' అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీముడిగా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు.  యాక్షన్ దృశ్యాల్లో ఎంత వీరోచితంగా కనిపించారో... భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతలా కంటతడి పెట్టించారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం అయితే ప్రేక్షకుల గుండెలను పిండేసింది. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ నటనకు ఇప్పుడు సైమా అవార్డు వచ్చింది. 

సైమా వేడుకల కోసం 'దేవర' చిత్రీకరణకు ఎన్టీఆర్ చిన్న బ్రేక్ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ సిటీలో 'దేవర' అండర్ వాటర్ సీక్వెన్సులు, యాక్షన్ సీన్లు తీస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన తర్వాత సుమారు సంవత్సరం పాటు ఎన్టీఆర్ 'దేవర' స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తూ... శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. 

'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రానికి (RRR Movie) సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) పట్టం కట్టింది. ఈ ఏడాది సైమా వేడుకలో దుబాయ్ (Dubai)లో జరిగాయి. తెలుగు, కన్నడ భాషలకు చెందిన అవార్డులను శుక్రవారం ప్రదానం చేశారు. అందులో 'ఆర్ఆర్ఆర్' సినిమా హవా కనిపించింది.

ఉత్తమ నటుడు ఎన్టీఆరే...
'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ఇంకా అవార్డులు!
ప్రేక్షకులు ముందుగా ఊహించినట్లు 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఇంకా దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ అవార్డులు అందుకున్నారు. సైమా 2023లో అత్యధిక అవార్డులు అందుకున్న సినిమా 'ఆర్ఆర్ఆర్' అని చెప్పవచ్చు. రాజమౌళి కుటుంబం ఈ అవార్డు వేడుకలకు హాజరు కాలేదు. రాజమౌళి అవార్డును జూనియర్ ఎన్టీఆర్ అందుకోగా... కీరవాణి అవార్డును చంద్రబోస్ అందుకున్నారు. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సైమా 2023 విజేతల వివరాలు

  • ఉత్తమ నటుడు - ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
  • ఉత్తమ నటి - శ్రీ లీల (ధమాకా సినిమా)
  • ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్ సినిమా)
  • ఉత్తమ సినిమా - సీతా రామం (వైజయంతి మూవీస్ అశ్వినీదత్, స్వప్న సినిమా)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్ సినిమా)
  • ఉత్తమ ఛాయాగ్రాహకుడు - కె. సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
  • ఉత్తమ సాహిత్యం - చంద్రబోస్ (ఆర్ఆర్ఆర్ సినిమా)
  •  
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - అడివి శేష్ (మేజర్ సినిమా)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం సినిమా)
  •  
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - వశిష్ఠ (బింబిసార సినిమా)
  • బెస్ట్ డెబ్యూ (హీరో) - అశోక్ గల్లా (హీరో సినిమా)
  • బెస్ట్ డెబ్యూ (హీరోయిన్) - మృణాల్ ఠాకూర్ (సీతా రామం సినిమా)
  • బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడ్యూసర్స్ - శరత్ & అనురాగ్ (మేజర్ సినిమా)
  • సెన్సేషనల్ ఆఫ్ ది ఇయర్ - కార్తికేయ 2
  •  
  • ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్ సినిమా)
  • ఉత్తమ సహాయ నటి - సంగీత (మాసూద సినిమా)
  • ఉత్తమ విలన్ - సుహాస్ (హిట్ 2 సినిమా)
  • ఉత్తమ హాస్యనటుడు - శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2 సినిమా)
  • ఫ్యాషన్ యూత్ ఐకాన్ - శృతి హాసన్!
  • ప్రామిసింగ్ స్టార్ - బెల్లంకొండ గణేష్!
22:02 PM (IST)  •  16 Sep 2023

స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి గుడివాడ అమర్నాథ్

తప్పుచేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్న చంద్రబాబు చేసిన అవినీతి మీద చర్చకు రమ్మనమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని లోకేష్ పిలవడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఒక్క స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి గుడివాడ అన్నారు.  శనివారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ.డీ., ఐ.టీ, సిఐడి అధికారులు విచారణకు రమ్మనమని లోకేష్ ను పిలుస్తుంటే, దాని గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చర్చకు పిలిచిన లోకేష్ తన స్థాయి ఏంటో, అతని బతికేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ పాత్ర బయట పెట్టడానికే దర్యాప్తు సంస్థలు ఆయనను పిలుస్తున్నాయని అమర్నాథ్ అన్నారు. 371 కోట్ల రూపాయలు పందికొక్కుల్లా తినేసి, బలిసి, అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బహిరంగ చర్చకు ఏ విధంగా పిలుస్తున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. 

21:54 PM (IST)  •  16 Sep 2023

కేంద్ర మంత్రి అమిత్ షాతో పీవీ సింధు భేటీ

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. పీవీ సింధుతో భేటీ అనంతరం అమిత్ షా స్పందించారు. సింధు అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేసిందన్నారు. ఆట పట్ల ఆమె నిబద్ధత, చేసిన కృషి, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ ట్వీట్ చేశారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget