(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live Telugu Updates: తెలంగాణ ప్రభుత్వానికి ఎస్పీల జాబితాను పంపిన ఈసీ
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE
Background
అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ప్రమేయంతోనే ఘర్షణలు జరిగాయన్న కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు పెట్టిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణల్లో చంద్రబాబు ప్రమేయం ఉందని పోలీసులు కేసు పెట్టారు. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం వాదనలు ముగిశాయి. రిజర్వ్ చేసిన తీర్పును ఈ ఇవాళ వెల్లడించింది న్యాయస్థానం. బెయిల్ షరుతుల్లో భాగంగా రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.
సీడీఆర్ పిటిషన్‌పై విచారణ 18కి వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనను అరెస్టు చేసిన సందర్భంగా సీఐడీ అధికారులు ఎవరెవరితో మాట్లాడారు... ఎవరి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయనే విషయంపై క్లారిటీ కోసం వారి కాల్ డేటాను భద్ర పరచాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి 18కి వాయిదా వేశారు.
క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు వినిపించాయి. ఈ కేసుపై ఢిల్లీలో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... చారిత్రాత్మక తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని మొదటి నుంచి వాదిస్తోంది టీడీపీ. 17ఏ ప్రకారం అసలు ఈ కేసు కోర్టుల్లో నిలబడదని చెబుతోంది. అందుకే ముందుగా బెయిల్ కోసం ఎక్కడా ప్రయత్నం చేయకుండానే 17ఏ కోసం పోరాడుతోంది. ముందు ఈ పిటిషన్లను ఏసీబీ కోర్టు తర్వాత ఏపీ హైకోర్టు కొట్టేసింది.
దీంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను హరీష్ సాల్వే ప్రస్తావించారు.
మొదటగా హరీష్ సాల్వే వాదనలు
సోమవారం కోర్టు సమయం పూర్తయ్యే వరకూ విచారణ జరిగింది. మంగళవారం ఉదయమే విచారణ ప్రారంభమైన వెంటనే.. హరీష్ సాల్వేను ఎంత సేపు వాదనలు వినిపిస్తారని ధర్మాసనం అడిగింది. గంటసేపు అని చెప్పారు. ఆ మేరకు వాదనలు వినిపించారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘‘రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎతో రక్షణ లభించింది’’అని వాదించారు. వివిధ హైకోర్టుల్లో వచ్చిన తీర్పులను ఉదహరించిన సాల్వే.. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ చట్టబద్ధం కాదన్నారు. దాన్నే సవాల్ చేస్తున్నామని . అన్నీ కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారు. అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఖర్గేకు పంపించారు. ఈయన పీసీసీ చీఫ్‌గా కూడా పని చేశారు. జగనామా టికెట్ విషయంలోనే అసంతృప్తితో రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తనకు అవమానం జరిగిందని లేఖలో పేర్కొన్నారు.
ఈ నెల 18 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర
కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బస్సు యాత్ర ద్వారా వెళ్లాలని నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమైంది. బస్సు యాత్ర ప్రారంభం రోజున రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్ర రానున్నారు. ఈ టూర్ కొండగట్టు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.