అన్వేషించండి

Mahila Shakti Autos: ఏపీలో పేద మహిళలకు ఆటోలు-తొలివిడతలో 231 మందికి పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో పేద మహిళలకు మహిళాశక్తి పేరుతో ఆటోలు పంపిణీ చేస్తోంది జగన్‌ ప్రభుత్వం. తొలివిడతలో 231 ఆటోలు పంపిణీ చేస్తోంది.

Mahila Shakti Autos in AP: మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh Government). మహిళల కోసం ఇప్పటికే ఎన్నో  పథకాలు అమలు చేస్తోంది. కాపు నేస్తం పేరుతో 45ఏళ్ల నిండిన మహిళలకు ఏడాదికి 15వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా ఏడాదికి  15వే చొప్పున అందిస్తోంది. అంతేకాదు.. 2019 ఎన్నికల లోపు రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలకు... డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేసింది. పొదుపు సంఘాల్లోని మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తోంది. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రణాళికలు రచించింది. ఇప్పుడు..స్వశక్తితో ఎదగాలనుకొనే పేద మహిళలకు చేయూత అందించేలా మరో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. 

ఎస్సీ, ఎస్టీ మహిళలకు మహిళాశక్తి పేరుతో ఆటో (Auto)లు పంపిణీ చేస్తోంది. ఆటోలు అద్దెకు తీసుకుని నడుపుకుంటున్న పొదుపు సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల(SC  and ST womens)కు... ఈ ఆటోలు అందిచనుంది. కేవలం 10 శాతం (10 percent) ఖర్చుతో వారు ఆటోలు సమకూర్చుకుని... ఆర్థికంగా బలపడేలా మహిళా శక్తి  కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ-సెర్ప్‌ (SERP) పరిధిలో ఉన్నతి అనే కార్యక్రమం ద్వారా ఈ ఏడాదిలో మండలానికి ఒకరు చొప్పున 660  మండలాల్లో 660 మందికి ఈ ఆటోలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ (గురువారం) తొలివిడత (First phase) గా 231 మందికి ఆటోలు  అందజేస్తోంది. జిల్లాల వారీగా ఎంపికైన లబ్ధిదారులకు ఆ జిల్లాల్లోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆటోల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజయవాడ (Vijayawada) కు  సమీపంలోని గొల్లపూడిలో టీటీడీసీ కేంద్రంలో పది మంది లబ్ధిదారులకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆటోలు పంపిణీ చేశారు. మిగిలన వారికి ఏప్రిల్‌ 14న అంబేద్కర్  జయంతి రోజున అందించేలా అధికారులు ప్రణాళిక వేశారు. 

పేదలు ఆటో కొనలాంటే ఎంత సులువు కాదు. ఒక్కసారిగా డబ్బు పెట్టి ఆటో కొనలేరు. లోన్‌ తీసుకుంటే వడ్డీనే తడిసిమోపెడయ్యి.. వారికి అదనపు భారంగా మారుతుంది.  ఏళ్ల తరబడి ఈఎంఐలు కట్టినా అప్పు తీరే పరిస్థితి ఉండదు. పైగా... ఆదాయం లేని రోజుల్లో అప్పు కట్టడం కష్టంగా మారుతుంది. ఇంటి బాధ్యతలు మోసే మహిళలు... ఆ  పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమే. ఆటోలు నడుపుతూ ఇంటి భారం మోస్తున్న పేద మహిళలను.. ఇలాంటి కష్టం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం ఈ పథకం  తీసుకొచ్చింది. వారికి ఆర్థిక చేయూత కలిగిస్తోంది. 

పేద మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మహళాశక్తి పేరుతో కార్యక్రమం తీసుకొచ్చింది జగన్‌ సర్కార్‌. ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం మేర లబ్ధిదారులు  భరిస్తే.... మిగిలిన 90 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సెర్ప్‌ ద్వారా వడ్డీ లేని రుణంగా అందిస్తోంది. అంతేకాదు 90 శాతం (90 percent) మొత్తాన్ని48 నెలలపాటు (48  installments) ఈఎంఐల రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. దీని వల్ల... దాదాపు లక్షన్నర రూపాయల మేర లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈ  ఆటోలను లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి అందజేస్తున్నారు అధికారులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget