ఎమ్మెల్యేలకు షాక్‌ల మీద షాకులిస్తున్న సీఎం జగన్
పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్ ల మీద షాకులిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.
YSRCP Assembly Tickets Race : పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి (Chief Minister ) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy )షాక్ ల మీద షాకులిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections 2024 )గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజవర్గాల్లో కొత్త సమన్వయకర్తలను నియమించిన జగన్... తాజాగా ఉభయ గోదావరి జిల్లాల నేతలకు ఝలక్ ఇచ్చారు. ముగ్గురు మంత్రులను ఉన్న నియోజకవర్గాల బాధ్యతలు తప్పించారు. వారికి కొత్త నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఇపుడు మరో మంత్రి, కొందరు శాసనసభ్యులు ఆ జాబితాలోకి చేరిపోయారు. కొందరికి స్థాన చలనం తప్పదని స్పష్టం చేసిన జగన్, మరికొందరికి టికెట్ ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 2019లో తెలుగుదేశంపార్టీ గుర్తుపై విజయం సాధించిన మద్దాలి గిరికి ఈసారి మొండి చేయి చూపారు. రరేపు భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న భయంతో ఉన్న గిరి.. సోమవారం సీఎంతో సమావేశమయ్యారు.
ఉభయ గోదావరి జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చాలా వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడారు. పార్టీలో జరుగుతున్న మార్పులు చేర్పులపై వారితో మాట్లాడారు. అయినా కొందరు ససేమిరా అనడంతో వాళ్లను జగన్ వద్దకు తీసుకెళ్తున్నారు. అలాంటి వారిలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లంతా సోమవారం సాయంత్రం సీఎం సమావేశం అయ్యారు.
ఉభయగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో వ్యక్తిగతంగా మాట్లాడారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవసరాన్ని వాళ్లకు వివరించారు. ప్రజల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను తెలిపారు. సామరస్యంగా తప్పుకొని పార్టీ సూచించిన అభ్యర్థి విజయానికి పని చేయాలని హితవు పలికారు. పార్టీ అధికారంలోకి వస్తే తర్వాత తాను చూసుకుంటానంటూ ధీమా ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు సీఎం జగన్. ఈసారి ఉభయగోదావరి జిల్లాల నాయకులను మార్చే ప్రక్రియ చేపట్టారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఈసారి రాజమండ్రి గ్రామీణ అసెంబ్లీ, లేదా రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. రామచంద్రపురం టికెట్ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు దాదాపు ఖాయం చేసినట్లు సమాచారం. రాజమండ్రి నగర అసెంబ్లీ నుంచి ఎంపీ మార్గాని భరత్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం వద్దకు వెళ్లిన ఎస్సీ ఎంపీకి పి.గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఖరారు చేసినట్లు తెలిసింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్ లేనట్లేనని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: మరో నలుగురు ఇంచార్జ్ లను ఫైనల్ చేసిన జగన్! వైసీపీలో మరిన్ని మార్పులు
Also Read: పోలీస్ మెడల్స్ వారికి మాత్రమే! తీవ్రంగా స్పందించిన ఏపీ పోలీస్ శాఖ, చర్యలకు ఆదేశాలు