America-Onion-Salmonella: ఉల్లిపాయని చూసి వణికిపోతున్న అగ్రరాజ్యం
ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు కానీ అగ్రరాజ్యం మాత్రం ఉల్లిని చూసి వణికిపోతోంది. ఎందుకంటారా...
మనకి అగ్రరాజ్యం కానీ కరోనాకి కాదు కదా అందుకే... ఓ ఆటాడేసుకుంది. అప్పటి వరకూ అమెరికా అని గొప్పలు చెప్పుకునేవారంతా అమ్మో అమెరికా అనే పరిస్థితి వచ్చేసింది. ఎట్టకేలకు వ్యాక్సినేషన్ పుణ్యమా అని సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతలో ఉల్లిపాయల రూపంలో పెద్దన్నకి పెద్ద కష్టమే వచ్చి పడింది. అమెరికాలో ఉల్లిని చూసి వణికిపోతున్నారు. సొల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఇప్పుడు ఉల్లి ద్వారా వ్యాపించి.తీవ్ర అస్వస్థతకు గురి చేస్తోందట. ఈ మధ్య కాలంలో అమెరికా, కెనాడాల్లో ఉల్లి ద్వారా వ్యాపిస్తున్న బ్యాక్టిరీయాతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.
Also Read: అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఫీట్ హ్యాట్రిక్.. సాధించిన ఏకైక భారతీయ బౌలర్ ఎవరో తెలుసా?
ఉల్లిగడ్డ తిన్నవారికి 'సాల్మొనెల్లా' అనే వ్యాధి సోకుతోందట. ఇప్పటికే అమెరికాలో 37 రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాపించిందని, 650 పైగా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. విపరీతమైన కడుపునొప్పి, డయేరియా, జ్వరం, వాంతులు, మలంలో రక్తం లాంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేదు...అమెరికాలో అందరిదీ ఇదే పరిస్థితి. దీనికంతటికీ కారణం ఉల్లిగడ్డలో బ్యాక్టీరియా అని కాలిఫోర్నియాకు చెందిన థామ్సన్ ఇంటర్నేషనల్ సంస్థ గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఉల్లిపాయలు తిన్న ఆరుగంటల్లోనే సాల్మొనెల్లా వ్యాధి సోకుతున్నట్టు వైద్యులు గుర్తించారు. మెక్సికో నుంచీ దిగుమతి చేసుకున్న ప్రోసోర్ ఇంక్ సప్లై చేసిన ఉల్లిపాయల వలన ఇంత పెద్ద అనర్ధం జరిగిందని అధికారులు గుర్తించారు. ఇవి ఎరుపు, తెలుపు రంగులలో ఉన్నాయని ఇలాంటి ఉల్లిపాయలు ఇంట్లో ఉంటె వెంటనే వాటిని తగులపెట్టేయాలని సూచించింది CDC.
Also Read: చైనా దూకుడుపై బైడెన్ టెన్షన్.. ఆ క్షిపణి ప్రయోగంపై ఆందోళన!
అమెరికాలో సెప్టెంబర్ లోనే సాల్మొనెల్లా కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సాల్మొనెల్లా వ్యాధి అమెరికాలోని 37 రాష్ట్రాలకు వ్యాపించింది. టెక్సాస్‌లో అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మేరీల్యాండ్‌లో 58, మిస్సోరీలో 21 కేసులు నమోదయ్యాయని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఒక వేళ ఈ వ్యాధి సోకితే వైద్యుల వద్దకు వెళ్ళేలోగా ఎక్కువగా మంచి నీళ్ళు త్రాగాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
Also Read: అదిరిపోయే లుక్ తో టాటా పంచ్..తక్కువ ధరలో సూపర్ కారు
Also Read: 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.15 వేలలోపే.. అమెజాన్ సేల్‌లో బంపర్ ఆఫర్!
Also Read: రెడ్‌మీ కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయ్.. సూపర్ ఫీచర్లు.. బడ్జెట్ రేట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి