Alluri District Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - వ్యాన్, లారీ ఢీకొని 8 మంది మృతి
లారీ, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం మంగళవారం మధ్యాహ్నం చింతూరు లోని బొడ్డు గూడెంలో జరిగింది. వ్యాను - లారీ ఢీకొన్న ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలో ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఛత్తీస్ గఢ్ నుంచి భద్రాచలం వెళ్లి వస్తుండగా అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు, గాయపడిన వారంతా ఛత్తీస్ గఢ్‌కు చెందిన వారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోగా మృతుల సంఖ్య 8కు చేరుకుందని అధికారులు తెలిపారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
నరసారావుపేటలో విషాదం..
నరసరావుపేట మండలం కేసానుపల్లికి చెందిన రావిపాటి వెంకన్న, దాచేపల్లికి చెందిన నాగూర్ అలియాస్ బిల్లాతో కలిసి చంటి దొంగతనాలే చేసేవాడు. దొంగ బంగారాన్ని మార్పిడి చేసుకునేందుకు నరసరావుపేటలోని ఓ నగల దుకాణం ఉద్యోగి, జొన్నలగడ్డకు చెందిన సిలివేరు రామాంజనేయులు సాయం తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో బాజీ ఈ ఏడాది ఏప్రిల్ 22న రామాంజనేయులను కిడ్పాన్ చేసి అతని నుంచి నిజం రాబట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రామాంజనేయులను బాజీ చంపాడు.
తమను బాజీ వెతుకుతున్నాడని ఈ గ్యాంగ్ పసిగట్టింది. ఇంతలో గ్యాంగ్‌లో రామాంజనేయులు చనిపోవడంతో వారిలో టెన్షన్ మొదలైంది. రామాంజనేయులను చంపిన బాజీ తమనూ చంపుతాడన్న భయం మిగతా నిందితులకు పట్టుకుంది. అతను తమను ఎటాక్ చేయకముందే బాజీ చంపాలని ప్లాన్ వేశారు. రామాంజనేయులను చంపిన కేసులో పోలీస్ స్టేషన్ కు వచ్చి తిరిగి వెళ్తున్న బాజీపై దాడి చేశారు. ఈ దాడిలో బాజీ గాయాలతో తప్పించుకుని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పోలీసుల ఎంట్రీతో రావిపాటి వెంకన్న, బిల్లాతోపాటు మరికొందరు చిక్కారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో దొంగలించిన బంగారాన్ని డబ్బు రూపంలోకి మార్చే బాధ్యతను వాళ్లంతా కలిసి చంటికి అప్పగించారు. తర్వాత డబ్బుల విషయంలో వారికీ చంటికీ గొడవ మొదలైంది. అలా చంటిని కిడ్నాప్ చేసి విజయవాడంలోని లాడ్జీలో చిత్రహింసలు పెట్టి చంపారు. తర్వాత మృతదేహాన్ని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు టోల్ గేట్ సమీపంలో పూడ్చి పెట్టారు.
మొలతాడు, తాయత్తుతో చంటిగా గుర్తింపు..
నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు బొమ్ములూరులో మృతదేహం కోసం తవ్వకాలు జరిపారు. కుళ్లిన స్థితిలో మృతదేహం, మొలతాడు, తాయత్తు కనిపించగా.. అవి చంటివేనని కుటుంబసభ్యులు గుర్తించారు. ఈ కేసులో రావిపాటి వెంకన్న, బిల్లాతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.