Akash Missile Test: ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్' ప్రయోగం విజయవంతం
ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించింది. డీఆర్‌డీఓను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
ఆకాశ్ క్షిపణి.. న్యూ వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్'ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపుర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం ఈ క్షిపణిని ప్రయోగించారు.
DRDO today conducts Successful Maiden Flight Test of Akash Prime Missile from Integrated Test Range (ITR), Chandipur, Odisha. pic.twitter.com/QlvMHtTWVj
— DRDO (@DRDO_India) September 27, 2021
శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఈ క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. క్షిపణి కొత్త వెర్షన్‌కు మెరుగుపరిచి ఆ తర్వాత పరీక్షించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.
రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు..
ఆకాశ్ ప్రైమ్ ప్రయోగంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం, వాయుసేన, డీపీఎస్‌యూ, డీఆర్‌డీఓకు రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపచం స్థాయి క్షిపణలను తయారు చేయగల సత్తా డీఆర్‌డీఓకు ఉందని ఈ ప్రయోగం మరోసారి రుజువు చేసిందన్నారు.
ఆకాశ్ ప్రైమ్ ప్రయోగంలో పాల్గొన్న బృందాన్ని డీఆర్‌డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి అభినందించారు. ఈ ప్రయోగం దేశ సైన్యం ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి