Air India Express flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మంటలు, టేకాఫ్ అయిన కాసేపటికే ల్యాండింగ్
Air India Express flight: ఎయిర్ ఇండియా ప్లైట్‌లో మంటలు చెలరేగాయి.
Air India Express flight:
వరుస ఘటనలు..
ఎయిర్ ఇండియాకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఓ ఘటన ఆ కంపెనీ క్రెడిబిలిటీని దెబ్బ తీస్తున్నాయి. ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై యూరినేట్ చేసిన ఘటనతో చాలా రోజుల పాటు సంచలనమైంది. యాజమాన్యం కూడా అలెర్ట్ అయింది. లూప్‌హోల్స్‌ని కనిపెట్టి పరిష్కరించే ప్రయత్నాలు చేస్తోంది. అయినా...మరోసారి టెక్నికల్ సమస్య ఎదురైంది. అబుదాబి నుంచి క్యాలికట్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఎడమ వైపు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే గుర్తించిన పైలట్... అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ చేశాడు. ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. B737-800 ఎయిర్ క్రాఫ్ట్‌లోని ఇంజిన్‌లో మంటలు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. టేకాఫ్ అయిన వెంటనే మంటలు రావడం వల్ల తిరిగి అక్కడే ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఆరా తీసిన DGCA విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇలా ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లలో మంటలు చెల రేగాయి. గతేడాగి సెప్టెంబర్ 14న ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. మస్కట్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుంచి పొగలు వచ్చాయి. ఈ ప్రమాద సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే...ప్రస్తుతం జరిగిన ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. వీలైనంత త్వరగా విచారణ జరిపిస్తామని వెల్లడించింది. విచారణ తరవాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో నిఘా..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మహిళపై ఓ వ్యక్తి యూరినేట్ చేసిన ఘటనలో విచారణ ఓ కొలిక్కి వచ్చింది. కానీ...ఆ కంపెనీ మాత్రం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. సాఫ్ట్‌వేర్ ఆధారంగా విమానంలో జరిగే అన్ని యాక్టివిటీస్‌పైనా నిఘా పెట్టేందుకు సిద్ధమైంది. పొరపాటున ఇలాంటి సంఘటనలు జరిగితే...అందుకు సంబంధించిన సమాచారం అంతా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఎయిర్ ఇండియాలోని ప్రతి అధికారికీ అందుకు సంబంధించిన అన్ని వివరాలు ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. పారిస్ నుంచి ఢిల్లీ వస్తున్న ఫ్లైట్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై యూరినేట్ చేసిన ఘటన వివాదాస్పదమైంది. సిబ్బంది ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తరవాత చాలా రోజుల పాటు పరారీలో ఉన్న నిందితుడుని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ ఘటన న్యూయార్క్ ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలం అయినందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్ కు 3లక్షల రూపాయల ఫైన్ విధించింది. ఆరోపణలకు సంబంధించి ఎయిర్ ఇండియా.. ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
Also Read: Elon Musk Twitter: ట్విటర్ అకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టుకున్న ఎలన్ మస్క్, కారణమిదేనట!