అన్వేషించండి

Air India: అదే గాల్లో జరిగి ఉంటే మరో అహ్మదాబాద్ ఘోరమే - ఎయిర్ ఇండియా మరో విమానంలో ఇంధన స్విచ్ సమస్య !

Air India Boeing 787 Dreamliner: ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ లో ఇంధన స్విచ్ సమస్య బయటపడటం సంచలనంగా మారింది. అహ్మదాబాద్‌ ఘటన ఈ కారణంగానే జరిగిందన్న అంచనాలు ఉన్నాయి.

Air India Boeing 787 Dreamliner defect in the fuel control switch : ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఇంధన నియంత్రణ వ్యవస్థలో   తలెత్తిన సాంకేతిక లోపం హాట్ టాపిక్ గా మారింది. అహ్మదాబాద్ ప్రమాద ఘటన గుర్తుకు వచ్చేలా ఉండటంతో సంచలనంగా మారింది.  
  
లండన్-బెంగళూరు విమానంలో కలకలం 

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (VT-ANX) విమానం లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న తర్వాత, పైలట్లు అందులోని  ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లో లోపాన్ని గుర్తించారు. ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో స్విచ్  రన్ పొజిషన్‌లో లాక్ అవ్వకుండా, దానంతట అదే  కటాఫ్ వైపు మళ్లుతోందని వారు ఫిర్యాదు చేశారు. విమానం గాలిలో ఉన్నప్పుడు ఇలా జరిగితే ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయి అవి ఆగిపోయే ప్రమాదం ఉండటంతో, ఎయిర్ ఇండియా తక్షణమే స్పందించి ఆ విమానాన్ని గ్రౌండింగ్ చేసింది. దీనిపై తయారీ సంస్థ బోయింగ్ , విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కి సమాచారం అందించారు.

అహ్మదాబాద్ ప్రమాదం తెచ్చిన భయం 

ఈ తాజా ఘటనపై ఇంతటి ఆందోళన కలగడానికి ప్రధాన కారణం గత ఏడాది జరిగిన ఘోర విమాన ప్రమాదమే.  2025 జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే ఎయిర్ ఇండియాకు చెందిన మరో డ్రీమ్‌లైనర్ విమానం (AI 171) కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో  260 మంది మరణించారు. ఆ విమాన ప్రమాదంపై జరిగిన ప్రాథమిక విచారణలో, రెండు ఇంజిన్ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ కు మారడం వల్ల ఇంధనం అందక ఇంజిన్లు ఆగిపోయాయని వెల్లడైంది. తాజా ఘటనలో కూడా సరిగ్గా అదే రకమైన లోపం కనిపించడం భద్రతా పరమైన ఆందోళనలను రెట్టింపు చేసింది.

గతంలో  తనిఖీలు 

అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత, డీజీసీఏ ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా తన వద్ద ఉన్న అన్ని బోయింగ్ 787 విమానాల ఫ్యూయల్ స్విచ్‌లను తనిఖీ చేసింది. ఆ సమయంలో ఏ విమానంలోనూ లోపాలు లేవని సంస్థ ప్రకటించింది. అయితే, తాజా ఫిర్యాదుతో ఆ తనిఖీల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా విమానయాన సంస్థ ఎఫ్ఏఏ   కూడా గతంలోనే ఇలాంటి స్విచ్‌ల లోపాలు ఇంజిన్ షట్‌డౌన్‌కు దారితీస్తాయని హెచ్చరించింది. ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఇతర విమానాలపై కూడా దృష్టి సారించింది. 

తీవ్రమైన లోపమే 

విమానయాన నిపుణులు ఈ లోపాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు.  గతంలో లోపాలు లేవని చెప్పిన విమానంలోనే ఇప్పుడు సమస్య రావడం విస్మయానికి గురిచేస్తోంది అని సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం బోయింగ్ ఇంజనీర్లు ,  డీజీసీఏ అధికారులు ఈ విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని ఎయిర్ ఇండియా పేర్కొన్నప్పటికీ, డ్రీమ్‌లైనర్ విమానాల డిజైన్ లేదా మెకానికల్ సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఇప్పుడు బోయింగ్ సంస్థపై ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget