Kabul Airport: ఎయిర్ పోర్ట్ వద్ద ఉండొద్దు.. ఇళ్లకు వెళ్లిపోండి: తాలిబన్లు
అఫ్గానిస్థాన్ ప్రజలకు తాలిబన్లు పలు సూచనలు చేశారు. కాబూల్ విమానాశ్రయం బయట వేచిచూస్తున్న ప్రజలు తమ ఇళ్లకు వెళ్లాలని కోరారు.
కాబూల్ విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్న ప్రజలు తమ ఇళ్లకు వెళ్లాలని తాలిబన్లు సూచించారు. వీరంతా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న తాలిబన్లు చేసిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అయితే తాము ఎవరిపైనా దాడి చేయాలనుకోవడం లేదని తాలిబన్లు అంటున్నారు.
ఎలాంటి హింస చేలరేగకుండానే కాబూల్ ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. అయితే తాలిబన్ల రాజ్యం నుంచి తప్పించుకునేందుకు వేలాదిమంది అఫ్గాన్లు కాబూల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు.
VIDEO: Gunshots heard in Jalalabad as Afghans protest with national flag.
— AFP News Agency (@AFP) August 19, 2021
Firing is heard in Jalalabad as residents protest over the removal of Afghan flags that were replaced with that of the Taliban, according to local media pic.twitter.com/IzWDwDLT1J
రైటర్స్ నివేదిక ప్రకారం ఆదివారం నుంచి ఇప్పటివరకు విమానాశ్రయం వద్ద మొత్తం 12 మంది చనిపోయినట్లు సమాచారం. అయితే వీరంతా కాల్పుల వల్ల చనిపోయారా లేదా తొక్కిసిలాటలో మరణించారో స్పష్టత లేదని తాలిబన్ అధికారి తెలిపారు. సరైనా పత్రాలు లేనివారు వెంటనే తమ ఇళ్లకు వెళ్లిపోవాలని ఆయన కోరారు.
ALSO READ:
Afghanistan Taliban News: అఫ్గాన్ ప్రస్తుత పరిస్థితిపై భారత వైఖరేంటి? విదేశాంగ మంత్రి ఎమన్నారంటే..
ఆదివారం నుంచి ఇ్పటివరకు దాదాపు 8 వేల మంది కాబూల్ ను విడిచి వెళ్లినట్లు ఓ భద్రతా అధికారి తెలిపారు. ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం యూఎస్ మిలిటరీ కంట్రోల్ లో ఉంది. ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలకు తాలిబన్లు రక్షణ కల్పిస్తున్నారు. అయితే చాలామంది ప్రజలను ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అయితే గుంపులుగా ఉన్న జనాన్ని చెదరగొట్టేందుకే తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారని అధికారులు అంటున్నారు.
మరోవైపు తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. షెరియా చట్టం తప్పక అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
Afghanistan Funds : బ్యాంకుల్లోని ఆఫ్గాన్ డబ్బులకు వారసులెవరు..?