UP Viral News: ప్రజ్వల్ రేవణ్ణను మించిన బీజేపీ మహిళా నేత కుమారుడు - 130 మంది మహిళలతో... !
UP Adultary BJP Leader: యూపీలో బీజేపీ మహిళా నేత కుమారుడు ఒకరు వందల మంది మహిళల్ని లోబర్చుకుని వీడియోలు తీసుకున్నారు. ఈ వ్యవహారం ఆయన భార్య బయట పెట్టింది.

BJP woman leader son Video Scandal: ఉత్తరప్రదేశ్‌లోని మొయిపురిలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలైన సీమా గుప్తా కుమారుడు శుభం గుప్తాకు సంబంధించిన 130కి పైగా అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. మొయిన్ పురిలోని బీజేపీ మహిళా మోర్చా సిటీ ప్రెసిడెంట్ సీమా గుప్తా కుమారుడు శుభం గుప్తా ఈ వీడియోలు తీసుకున్నారు. మొయిన్ పురిలో ఉన్న దాదాపు అన్ని ప్రముఖ హోటళ్లు , రెస్టారెంట్లలో ఆయన నిర్వాకాలు కనిపిస్తున్నాయి. శుభం గుప్తా పలువురు మహిళలతో అభ్యంతరకర స్థితిలో ఉన్న వీడియోలు ఉన్నాయి.
శుభం గుప్తాకు తన భార్య షీతల్ గుప్తా మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భర్త శాడిస్ట్ అని అసహజ లైంగిక శృంగారానికి పాల్పడటం.. సిగరెట్ కాల్చడం వంటి పనులు చేస్తున్నాడని ఆరోపించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వీడియోలు విడుదల అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షీతల్ గుప్తా తన భర్త ఈ అశ్లీల వీడియోలను తనకు బలవంతంగా చూపించేవాడని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలు ఇతర మహిళలతో శృంగారం చేస్తున్నప్పుడు తనను తాను చిత్రీకరించుకునేవాడు.
Breaking news🚨#Mainpuri, #UttarPradesh, involving over 130 obscene videos allegedly featuring Shubham Gupta, son of a #BJP Mahila Morcha leader. His wife, Sheetal Gupta, filed a complaint claiming abuse and that he forced her to watch these videos @myogiadityanath
— Learn Today (Anjali) (@AnjaliLearn) May 31, 2025
@BJP
@2025 pic.twitter.com/r6LAI3HxOW
నాలుగు సంవత్సరాలుగా శుభం తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించింది. ఈ 130 వీడియోలు ఎలా లీక్ అయ్యాయనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు, కానీ ఇవి శుభం గుప్తా భార్య షీతల్ గుప్తానే లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు. శుభం గుప్తా కర్ణాటకలోని బీజేపీ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ స్కాండల్‌తో “పోటీ” పడుతున్నాడని సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
शुभम गुप्ता के 130 वीडियो वायरल हो रहे हैं!
— AMIT KUMAR (@IamAMITkumar83) May 31, 2025
बीजेपी नेता बब्बन सिंह और मनोहर लाल धाकड़ के बाद अब shubham gupta का नाम भी इस लिस्ट में जुड़ गया है!
क्या अब इन नेताओं में अश्लीलता में रिकॉर्ड तोड़ने की होड़ मची है?
सरकार से आग्रह है – जो भी अश्लीलता फैलाए, चाहे किसी भी पार्टी का… pic.twitter.com/pqrpmur6UP
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మండ్సౌర్‌లో బీజేపీ నాయకుడికి సంబంధించిన మరొక అశ్లీల వీడియో వైరల్ అయిన సమయంలోనే బయటకు రావడంతో బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. వీడియోల వ్యవహారంలో యూపీలోని యోగి సర్కార్ ఆత్మరక్షణా ధోరణిలో పడింది.





















