Viral Court Video: భర్తను చంపిన కేసులో విచారణ -జడ్జికి షాకిచ్చేలా వాదించిన మహిళ - ఈ వీడియో బాలీవుడ్ సినిమా సీన్లకన్నా ధ్రిల్లర్ !
Madyapradesh: తన భర్తను కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిందని ఆ మహిళపై హత్యానేరం నమోదు అయింది. కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ విచారణ వీడియో సూపర్ ధ్రిల్లింగ్ గా మారింది.

MP High Court: సినిమాల్లో కోర్టు సీన్లు చాలా పకడ్బందీగా సాగుతాయి. ఉత్కంఠకు గురి చేస్తాయి. పరస్పరం వాదనలతో హోరెత్తిపోతాయి.
इन बुजुर्ग महिला का नाम ममता पाठक है ये एक प्रोफेसर रह चुकी हैं।
— Dr. Sheetal yadav (@Sheetal2242) May 28, 2025
इनको अपने पति की हत्या का दोषी ठहराया गया था।
जिस वजह से ये, Mamta Pathak vs State of Madhya Pradesh केस में खुद ही लीगल प्रैक्टिस कर रहीं हैं।
इसीलिए कहा जाता है कि शिक्षा बहुत जरूरी है ताकि आपका हक कोई न छीन… pic.twitter.com/k3cVXOwnb1
ఇద్దరు లాయర్లు వాదింది కరెక్టే కదా అనిపిస్తుంది. నిజంగా కోర్టుల్లో జరిగే వాదనల్లో అంత డ్రామా ఉండదు. కానీ అప్పుడప్పుడూ మాత్రం సినిమా సీన్లకు మించిన హై వోల్టేజ్ విచారణ జరుగుతుంది.అలాంటిదే ఒకటి మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ బెంచ్ లో జరిగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో 60 ఏళ్ల మమతా పాఠక్ అనే మహిళ, తన భర్త నీరజ్ పాఠక్‌ను మత్తు మాత్రలు ఇచ్చి కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ బెంచ్‌లో ఆమె స్వయంగా తన వాదనను వినిపించారు. లాయర్ ను పెట్టుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను నెటిజన్లు "బ్రేకింగ్ బాడ్ మూమెంట్"గా అభివర్ణించారు, ఆమె వాదనలు న్యాయమూర్తిని ఆశ్చర్యపరిచాయి.
మమతా పాఠక్, మాజీ ప్రొఫెసర్, తన భర్త నీరజ్ పాఠక్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. నీరజ్‌కు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత, ఆమె అతనికి అధిక మోతాదులో మత్తు మాత్రలు ఇచ్చి, ఆ తర్వాత కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు కేసు పెట్టాు. ఈ హత్య కేసులో ఆమె దోషిగా నిర్ధారించారు కూడా. జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
మమతా పాఠక్ స్వయంగా తన కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్పూర్ బెంచ్‌లో వాదించింది. ఇది "మమతా పాఠక్ vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్" కేసుగా నమోదైంది. కోర్టులో ఆమె వాదనలు చాలా ఆత్మవిశ్వాసంతో, స్పష్టంగా, వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఒక న్యాయమూర్తి ఆమెను హత్య ఆరోపణ గురించి ప్రశ్నించినప్పుడు ఆమె వాదన న్యాయమూర్తిని ఆశ్చర్యపరిచింది.
కోర్టు విచారణ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మంది నెటిజన్లు మమతా పాఠక్ వాదనలను మెచ్చుకున్నారు. కొందరు ఆమె హత్య ఆరోపణలను తీవ్రంగా పరిగణించారు . ఆమె ఆత్మవిశ్వాసం క్రిమినల్ అభియోగాలు ప్రముఖ టీవీ సిరీస్‌లోని పాత్రలను గుర్తు చేశాయని కొంత మంది చెప్పుకొచచారు. ఈ కేసు ఇంకా కోర్టులో విచారణలో ఉంది. మమతా పాఠక్ తాను నిర్దోషినని పెట్టుకున్న పిటిషన్ పై ఇంకా తీర్పు రావాల్సి ఉంది.





















