Viral Video:న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌లో భారతీయ పెళ్లి డాన్సులు - వీధి మొత్తం బ్లాక్ - నెటిజన్లు ఏమంటున్నారంటే ?
Indian Baraat: అమెరికాలోని న్యూయార్క్ లో బిజీ ఏరియా వాల్ స్ట్రీట్. అక్కడ ఓ పెళ్లి వేడుకతో మొత్తం బ్లాక్ చేసేశారు ఇండియన్స్.

Indian Baraat Shuts Down Wall Street: న్యూయార్క్ నగరంలోని వాల్ స్ట్రీట్‌లో 400 మంది పాల్గొన్న ఒక భారతీయ వివాహ పెళ్లికొడుకు ఊరేగింపు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. న్యూయార్క్ నగరంలోని వాల్ స్ట్రీట్‌లో .. మన దలాల్ స్ట్రీట్ లాంటిది. స్టాక్ మార్కెట్ కు కేంద్రం. ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అలాంటి చోట భారతీయ సంప్రదాయ దుస్తుల్లో సుమారు 400 మంది పెళ్లి వేడుక ర్యాలీని , మరియు ఆకాశహర్మ్యాల మధ్య ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ బరాత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బరాత్‌లో పాల్గొన్నవారు రంగురంగుల భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి, DJ బీట్స్‌కు డాన్సులు చేశారు. వీడియో వధూవరులు - ఎరుపు లెహంగా , లేత గోధుమ రంగు షేర్వానీ ధరించి మధ్యలో డాన్సులు చేస్తూ కనిపించారు.
🎉 A grand Indian wedding took over Wall Street in New York as a 400-member baraat danced through the streets to DJ beats!
— NETSNIX (@NetSnix) May 29, 2025
The vibrant celebration, complete with lehengas, sherwanis, and NYC’s iconic skyline, has the internet buzzing. 📹🔥
🔑 Key Details:
🔸 The 400-person… pic.twitter.com/1A1NzWq7gy
కొంత మంది ఈ బరాత్ ను పొగిడారు. కానీ ఎక్కువ మంది నెగెటివ్ గా స్పందించారు. ఇతరులకు అసౌకర్యం కలిగిస్తే, ఇది ఆమోదయోగ్యం కాదని కొంత మంది వ్యాఖ్యానించారు. వాల్ స్ట్రీట్‌ను బరాత్ కోసం షట్ డౌన్ చేయడం, ఇంకా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నానని.. మరొకరుస్పందించారు.
Big fat Indian wedding: Baraat of 400 people 'shut down Wall Street’ in viral video #GaddarTelanganaFilmAwards #Kadapa pic.twitter.com/C5D9dWtjdz
— बेलगाम (@be_lgaamX) May 29, 2025
అయితే ఇలా ఓ రోడ్డును మూసివేయడానికి డబ్బులు చెల్లించి అనుమతి తీసుకుని ఉంటారని కొంత మందిచెబుతున్నారు. వాల్ స్ట్రీట్‌లో ఒక బ్లాక్‌ను మూసివేయడానికి వారు ఎంత డబ్బు చెల్లించి ఉంటారో ఊహించండి అని కొంత మంది స్పందించారు.
Wow! 😮 A wedding procession with 400 people brought Wall Street in New York to a standstill! 🎉 Video shows the vibrant baraat with people dancing in the middle of the financial district. Talk about a market disruption! 🕺💃 #WallStreet #NYC #Baraat #IndianWedding #ViralVideo… pic.twitter.com/twRwFuyBAc
— Vivid Insaan 🧛 (@VividInsaan) May 29, 2025
ఈ బరాత్ వాల్ స్ట్రీట్‌ను తాత్కాలికంగా ఒక భారతీయ వివాహ వేడుకలా మార్చడం ద్వారా, భారతీయ సంస్కృతిని ప్రపంచ ఆర్థిక కేంద్రంలో ప్రదర్శించినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















