అన్వేషించండి

Saudi Arabia: సౌదీలో మద్య నిషేధం ఎత్తివేత - 73 ఏళ్ల తర్వతా విప్లవాత్మక నిర్ణయం

Alcohol ban: సౌదీ అరేబియాలో ఇప్పటి వరకూ మద్య నిషేధం అమల్లో ఉంది. ఇప్పుడు సడలించారు.

Alcohol ban lifted in Saudi Arabia: కఠినమైన నియమాలు పాటించే సౌదీ అరేబియా లో కూడా కాలానికి తగ్గట్లుగా మారే ప్రయత్నాలు చేస్తోంది. ఏడు దశాబ్దాలుగా ఆ దేశంలో మద్యానికి అనుమతి లేదు. ఇప్పుడు నిబంధనలు సడలిస్తోంది. 

గత ఏడాది దౌత్యవేత్తలకు అందుబాటులోకి మద్యం                             
 
2024 జనవరిలో, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని డిప్లొమాటిక్ క్వార్టర్‌లో 72 సంవత్సరాల తర్వాత మొదటి మద్యం దుకాణాన్ని ప్రారంభించింది. ఈ దుకాణం  కేవలం నాన్-ముస్లిం దౌత్యవేత్తలకు మాత్రమే మద్యం విక్రయిస్తుంది.   కొనుగోలు చేయడానికి దౌత్యవేత్తలు తప్పనిసరిగా ఒక మొబైల్ యాప్   ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి, దౌత్య గుర్తింపును చూపించాలి. నెలవారీ కోటాలను పాటించాలి.   దుకాణంలో ఫోటోలు తీయడాన్ని నిషేధించారు.  ఇప్పుడు మరింతగా సడలింపు ఇవ్వాలని సౌదీ భావిస్తోంది.   2026 నాటికి, సౌదీ అరేబియా తమ 73 ఏళ్ల మద్య నిషేధాన్ని మరింత సడలించాలని యోచిస్తోంది, దీని కింద దేశవ్యాప్తంగా సుమారు 600 లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లు,  పర్యాటక స్థలాలలో  మద్యం అమ్మకాలను అనుమతించనున్నారు.

20శాతం కంటే తక్కువ అల్కహాల్ ఉన్న వాటికి అనుమతి                  

సౌదీలో త్వరలో అనుమతి ఇవ్వనున్న మద్యం  అమ్మకాలు కేవలం  20 శాతం  కంటే తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలకు మాత్రమే పరిమితం చేస్తారు.  ఇవన్నీ పర్యాటకులు, విదేశీయులు ఉండే ప్రాంతాలకు పరిమితం.   రియాద్ ఎక్స్‌పో 2030 , FIFA వరల్డ్ కప్ 2034 వంటి అంతర్జాతీయ ఈవెంట్‌లను ఆకర్షించడానికి, పర్యాటక రంగాన్ని పెంచడానికి మెల్లగా మద్యం విషయంలో సౌదీ పాలకులు నిబంధనలు సడలిస్తున్నారు. సాధారణ పౌరులు, ముఖ్యంగా ముస్లింలు, మద్యం కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిషేధం కొనసాగుతుంది.  ఈ మద్యం నిషేధ సడలింపు విజన్ 2030లో భాగం, ఇది సౌదీ అరేబియాను ఆర్థికంగా బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం , జీడీపీలో పర్యాటక రంగం వాటా 2030 నాటికి   10 శాతానికి చేర్చడం వంటి లక్ష్యాల కోసం అమలు చేస్తున్నారు.   UAE , బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల్లో విజయవంతమైన మద్యం నియంత్రణ విధానాలను అనుసరించి, సౌదీ అరేబియా నియంత్రిత వాతావరణంలో మద్యం అమ్మకాలను అనుమతించడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తోంది   

మద్య నిషేధం వెనుక భిన్నమైన స్టోరీ 

సౌదీ అరేబియాలో మద్య నిషేధం 1952 నుండి అమలులో ఉంది. దీనికి కారణం రాజు అబ్దుల్‌అజీజ్ కుమారుడు ప్రిన్స్ మిషారీ మద్యం మత్తులో బ్రిటిష్ వైస్-కాన్సుల్ సిరిల్ ఓస్మాన్‌ను జిద్దాలో హత్య చేశాడు.  ఇస్లామ్‌లో మద్యం "హరామ్" గా పరిగణించబడుతుంది.  సౌదీ అరేబియా  మక్కా , మదీనా వంటి పవిత్ర స్థలాల స్థానంగా ఉంది. అందుకే అప్పట్నుంచి  ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసింది. అయితే, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్  విజన్ 2030 ప్రణాళిక కింద, దేశం ఆర్థికంగా బలోపేతం చేయడం,  పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి సామాజిక సంస్కరణలను చేపట్టింది.

టాప్ హెడ్ లైన్స్

US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
JD Vance Clarifies Visa Remarks: 'నాకు నా భారతీయ అత్తమామలంటే చాలా ఇష్టం'.. H-1B వీసా వ్యాఖ్యలపై జేడీ వాన్స్ క్లారిటీ!
'నాకు నా భారతీయ అత్తమామలంటే చాలా ఇష్టం'.. H-1B వీసా వ్యాఖ్యలపై జేడీ వాన్స్ క్లారిటీ!
Tech Professionals Return to India : అమెరికా వదిలి భారత్‌కు ఐటీ నిపుణులు - 2026లో ఆల్‌టైమ్ రికార్డు.. అసలు కారణాలివే!
అమెరికా వదిలి భారత్‌కు ఐటీ నిపుణులు - 2026లో ఆల్‌టైమ్ రికార్డు.. అసలు కారణాలివే!
Elon Musk: అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Embed widget