ABP Southern Rising Summit 2024: కేంద్ర కేబినెట్‌లో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు - సామాన్యుల విమానయాన ఆశలకు రెక్కలు తొడుగుతారా ?
Rammohan Naidu : భారత్‌లో మధ్యతరగతి ప్రజలకు విమానయానం ఇప్పటికీ ఓ కలే. మరి రామ్మోహన్ నాయుడు దాన్ని సాకారం చేస్తారా ?
ABP Southern Rising Summit: తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ రాజకీయాల్లో అత్యంత చిన్న వయసులోనే కీలక స్థానంలోకి వెళ్లిన నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రి మరణంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన ఆయన మూడో సారి ఎంపీగా గెలిచారు. కేంద్ర విమానయానశాఖా మంత్రిగా పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, చురుకైన లీడర్ అని ప్రధాని మోదీ ఆయనను ప్రోత్సహిస్తూంటారు. పనితీరులో ఇతర మంత్రుల కన్నా ఎంతో ముందు ఉన్నరు. విమానయాన రంగానికి వస్తున్న సవాళ్లను ఆయన ఒంటి చేత్తో ఎదుర్కొంటున్నారు.
Get ready to hear from Kinjarapu Ram Mohan Naidu, Union Minister of Civil Aviation @RamMNK at The Southern Rising Summit 2024! 📷
— ABP Desam (@ABPDesam) October 21, 2024
Join us on October 25 as he shares his thoughts on Coming of Age: Identity, Inspiration, and Impact. pic.twitter.com/VVszs4OIHn
భారత్‌లో విమానయానరంగం అభివృద్ది చెందిన దేశాల మాదిరిగా విరివిగా అందుబాటులోకి రాలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా మెరుగైన విమానయాన సౌకర్యాలు ఉన్నాయి. కానీ మన దేశంలో ఊహించిన స్థాయిలో ఆకాశయానం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. మధ్యతరగతి ప్రజలకు ఇప్పటికీ విమానం ఎక్కడం ఓ కల. ఒక్క సారి అయినా విమాన ప్రయాణం చేయాలనుకునేవారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. వారికి కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితి కారణం లగ్జరీనే. విమాన ప్రయాణం అంటే ఇంకా లగ్జరీగా మారింది.
ఉడాన్ పేరుతో ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విమానాల రాకపోకల్ని.. మధ్యతరగతికి అందుబాటులో ఉంచేలా చేసేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదని నిపుణలు విశ్లేషిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్మోహన్ నాయుడు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి పెట్టారు. అదే సమయంలో డిమాండ్ ఉన్న సమయంలో విమానాయాన సంస్థలు పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. వాటన్నింటిపై రామ్మోహన్ నాయుడు వర్క్ చేస్తున్నారు.
ఇప్పుడు కొత్తగా బాంబు బెదిరింపులు కామన్ అయిపోయాయి. వాటిని నిరోధించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల సంఖ్యను పెంచాల్సి ఉంది. ఆయనపై తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. తన అభిప్రాయాలను, ఆలోచలను.. దక్షిణాది రాజకీయ పయనాన్ని విశ్లేషించేందుకు ఏబీపీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"కు విశిష్ట అతిథిగా వస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీన ఉ.10 గంటల నుంచి ఏబీపీ నెట్ వర్క్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల మీద "ది సదరన్ రైజింగ్ సమ్మింట్"ను వీక్షించవచ్చు.
📸The Southern Rising Summit 2024 is here📸
— ABP Desam (@ABPDesam) October 23, 2024
Join us on October 25
🎥Tune in live on https://t.co/U5l1bBn40h https://t.co/yN3o2Q0uhp https://t.co/EqJx7iI6ZL@abpdesam @abplive #GoAheadGoSouth #TheSouthernRisingSummit2024 #ABPSouthernRisingSummit2024 #ABPDesam pic.twitter.com/yWY1p4rsi1