Minister wanted corn for free! : ఈ కేంద్రమంత్రి ఇంత పిసినారా ? మొక్కజొన్న పొత్తులు రూ. 15 అంటే బేరమాడుతున్నారు
మొక్కజొన్న పొత్తులు అమ్మే చిరు వ్యాపారి దగ్గర బేరం అడుతున్న కేంద్ర మంత్రి కులస్తే వీడియో వైరల్ అవుతోంది. రేటు రూ. 15 అంటే.. ఉచితంగానే వస్తాయి కదా అని ఆయన చెప్పడం చూసేవాళ్లకు షాక్‌కు గురి చేసేలా ఉంది.
Minister wanted corn for free! : ఆయన పెద్ద పొలిటిషియన్. చాలా పదవులు అలంకరించారు. ఇప్పుడు కూడా పెద్ద పదవిలోనే ఉన్నారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. ఆయన పేరు ఫగన్ సింగ్ కులస్తే. స్టీల్, కోల్ శాఖల మంద్రిగా ఉన్నారు. మధ్య ప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన ఆ స్థాయికి వచ్చారంటే ప్రజలకు ఎంతో సేవ చేసి ఉంటారని అనుకుంటారు. కానీ ఆయన చేసిన సేవంటో ఒక్క వీడియో చూస్తే అర్థమైపోతుంది.
#UnionMinister @FSKulasteOffice, after hearing the rate of 15 rupees for a corn, said, hey so #expensive, #corn is available here for free, you are giving 15 rupees. Won't do anything less"#ruralindia#rural2022 pic.twitter.com/nqZxUhnzwV
— DHIRAJ DUBEY (@Ddhirajk) July 21, 2022
మధ్యప్రదేశ్‌లోని తన నియోజకవర్గం పర్యటనకు వెళ్తున్న ఆయనకు ... చల్లటి వాతావరణంలోవేడి వేడిగా మొక్కజొన్న పొత్తులు తినాలని అనుకున్నారు. పొలం పక్కన మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటున్న చిన్న రైతు కనిపించాడు. ఆయన దగ్గర కారు ఆపించాడు. ఓ మూడు మొక్కజొన్న కండెలు కాల్పించాడు. తర్వాత రేటెంత అని అడిగాడు. అతను ఒక్కొక్కటి పదిహేను రూపాయలు అని చెప్పే సరికి.. అదో రకంగా మొహం పెట్టారు. ఇక్కడ మొక్క జొన్న పొత్తులు ఉచితంగా వస్తాయని సీరియస్‌గానే కామెంట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అతి కష్టం మీద జేబులో డబ్బులు తీశాడు. ఇచ్చారో లేకపోతే.. నేనే కేంద్రమంత్రిని నా దగ్గరే డబ్బులు వసూలు చేస్తావా అని బెదిరించి తీసుకెళ్లిపోయాడో తెలియదు కానీ.. వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
సాధారణంగా కేంద్ర మంత్రి స్థాయి వాళ్లు ఎవరైనా చిరు వ్యాపారుల దగ్గర ఏదైనా కొంటే... పది రూపాయల సరుకుకు వెయ్యి ఇచ్చి ... ఉంచుకోమంటారు. కానీ ఈ కులస్తే మాత్రం అసలు మొక్కజొన్న పొత్తులే ఉచితంగా కావాలన్నట్లుగా రుబాబు చేస్తున్నారు.
If hearing the price of a corn cob can shock Central Minister then imagine the plight of common citizens. Every day prices are rising but this government and its followers are bunch of shameless scoundrels who care for nothing else than their lust for power!! https://t.co/MvyBx49aLW
— Nikhil saigal নিখিল সাইগল (@saigal_nikhil) July 21, 2022
చిన్న రైతు విషయంలోనే ఇలా చేశారంటే ఇక సాయం అడగానికి వచ్చే ప్రజలకుఏ మాత్రం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న సెటైర్లు వినపిిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నేతల్ని గెలిపించినత కాలం అక్కడి ప్రజల బతుకులు బాగుపడవని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.