75th Independence Day: తొలిసారి త్రివర్ణపతాకాన్ని ఎగరేసింది ఎక్కడో తెలుసా? ఆ రోజు నెహ్రూ ఏం మాట్లాడారు?
75th Independence Day: భారతదేశ స్వాతంత్య్రోద్యమం సమయంలో జాతీయ జెండాను ఆమోదించటం నుంచి జాతీయ గీతాన్ని గుర్తించే వరకూ ఎన్నో ఆసక్తికర పరిణామాలు జరిగాయి.
దేశమే ముందు..మిగతావన్నీ తరవాతే..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటోంది భారత్. త్వరలోనే స్వాతంత్య్ర దినోత్సవాలనూ ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని పిలుపు మేరకు "హర్ ఘర్ తిరంగా"లో భాగంగా అందరి ఇళ్లపైనా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. "నేషన్ ఫస్ట్, ఆల్‌వేస్ ఫస్ట్" అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
1. 200 సంవత్సరాల పాటు భారత్ ఆంగ్లేయుల పాలనలో నలిగిపోయింది. 1857లో తొలిసారి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. దీన్నే సిపాయిల తిరుగుబాటుగా పిలుస్తారు. ఈ ఉద్యమానికి మంగళ్ పాండే నేతృత్వం వహించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్, బహదూర్ షా జఫర్, తాత్యా తోపే, నానా సాహిబ్ కూడా ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపారు. ఈ తిరుగుబాటుతోనే భారతీయుల్లో చలనం మొదలైంది. వారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలి, తరవాతి ఉద్యమాలకు ఊపిరినిచ్చింది.
2.1900లో స్వదేశీ ఉద్యమం మొదలైంది. బాలగంగాధర్ తిలక్, జేఆర్‌డీ టాటా సంయుక్తంగా బాంబే స్వదేశీ కో ఆపరేషన్ స్టోర్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థను స్థాపించారు. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఈ పోరాటాన్ని ఎంతో ప్రశంసించారు.
3. 1906 ఆగస్టు 7వ తేదీన తొలిసారి త్రివర్ణ పతాకాన్ని కోల్‌కతాలోని పార్సీ బగన్ స్క్వేర్ వద్ద ఎగరేశారు. అయితే అప్పటికి జాతీయ జెండాలో పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులుండేవి. 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకానికి ఆమోదం లభించింది. 1947 జులై 22వ తేదీన త్రివర్ణపతాకానికి తుది రూపు ఇచ్చారు. ఆగస్టు 15న ఎగరేశారు.
4.1942 ఆగస్టు 8వ తేదీన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు.
5. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి, జాతీయ గీతం ఏమీ లేదు. 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాన్నే తీసుకుని "జనగణమన"గా పేరు మార్చారు. 1950 జనవరి 24న ఈ జాతీయ గీతాన్ని అధికారికంగా ఆమోదించారు.
6. బ్రిటీష్ బారిష్టర్ సర్ సిరిల్ ర్యాడ్‌క్లిఫ్ 1947లో ఆగస్టు 3వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న ర్యాడ్‌క్లిఫ్ లైన్‌గా పిలుచుకునే సరిహద్దుని ఏర్పాటు చేశారు.
7. ఇండస్ వ్యాలీ నాగరికతకు గుర్తుగా, భారత్‌కు ఇండియా అనే పేరు పెట్టారు.
8.1947 ఆగస్టు 15వతేదీన అర్ధరాత్రి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అదే రోజున భారత్‌తో పాటు కొరియా, కాంగో, బహ్రెయిన్, లీచ్‌టెన్‌స్టేన్ దేశాలకూ స్వాతంత్య్రం లభించింది.
9. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగరేశారు. "ప్రపంచమంతా నిద్రపోతున్న ఈ సమయంలో భారత్ మేలుకొంది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది" అని ప్రసంగించారు నెహ్రూ.
10. భారత జాతీయ గేయం "వందేమాతరం". ఇది బంకించంద్ర ఛటర్జీ 1880లో రచించిన ఆనంద్‌మఠ్ నవలలోని ఓ గేయం. 1950 జనవరి24న వందేమాతర గీతాన్ని అధికారికంగా గుర్తించారు.
Also Read: Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి