Ladakh: లద్దాఖ్‌లో ఘోర విషాదం, యుద్ధ ట్యాంక్ నది దాటుతుండగా ప్రమాదం - ఐదుగురు సైనికులు గల్లంతు
Ladakh News: లద్దాఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యుద్ధ ట్యాంక్‌లో నది దాటుతుండగా ప్రవాహం పెరిగి ఐదుగురు జవాన్లు నీటిలో పడి కొట్టుకుపోయారు.
Ladakh Tank Accident: లద్దాఖ్ వద్ద ఘోర ప్రమాదంలో ఐదుగురు సైనికులు నదిలో గల్లంతయ్యారు. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. Line of Actual Control వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. T-72 ట్యాంక్‌లో మందిర్ మోర్హ్ నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. యుద్ధ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా ఐదుగురు జవాన్లు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
On 28 Jun 2024 night, while deinducting from a military training activity, an army tank got stuck in the Shyok River, near Saser Brangsa, Eastern Ladakh due to sudden increase in the water level. Rescue teams rushed to the location, however, due to high current and water levels,…
— @firefurycorps_IA (@firefurycorps) June 29, 2024
జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న Mandir Morh వద్ద నది దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ దారుణం జరిగింది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
A mishap took place in the Daulat Beg Oldie area of Ladakh during a tank exercise of crossing the river yesterday in the sector due to a sudden increase in water levels there. Loss of lives of Army personnel is feared. More details are awaited: Defence officials pic.twitter.com/my7pYEvWP8
— ANI (@ANI) June 29, 2024
ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నది దాటుతుండగా ఇలా ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిలిటరీ ట్యాంక్ యాక్టివిటీ జరుగుతుండగా ఆర్మీ ట్యాంక్ ష్యోక్ రివర్‌లో ఉన్నట్టుండి చిక్కుకుపోయింది. సరిగ్గా అదే సమయంలో నదీ ప్రవాహం పెరిగింది. అప్పటికే రెస్క్యూ టీమ్ అందుబాటులోకి వచ్చింది. కానీ...ప్రవాహ ఉద్దృతి విపరీతంగా ఉండడం వల్ల వాళ్లను బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు. ఫలితంగా ఐదుగురూ నీళ్లలో పడి కొట్టుకుపోయారు.
Defence Minister Rajnath Singh tweets, "Deeply saddened at the loss of lives of five of our brave Indian Army soldiers in an unfortunate accident while getting the tank across a river in Ladakh...My heartfelt condolences to the bereaved families. The nation stands firm with them… https://t.co/PooMkUnYsd pic.twitter.com/4XZtlBZni5
— ANI (@ANI) June 29, 2024
Also Read: Delhi Airport: పేక మేడల్లా కూలుతున్న నిర్మాణాలు, వరుస ప్రమాదాలతో మోదీ సర్కార్‌కి అగ్ని పరీక్ష