అన్వేషించండి

Telangana News: ఘోర విషాదం - పసికందు ప్రాణం తీసిన ఎలుకలు

Rats Bite: ఎలుక కొరికి 40 రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. అటు, హైదరాబాద్ లో కుక్కల దాడిలో 5 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Baby Died Due to Rat Biting in Nagarkurnool: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఎలుక కొరకడంతో 40 రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. పట్టణంలోని నాగనూల్ (Naganool) గ్రామానికి చెందిన లక్ష్మీకళ, పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన శివ దంపతులకు 40 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. అప్పటి నుంచి లక్ష్మీకళ ఆమె అమ్మ ఇంటి వద్దే ఉంటోంది. శనివారం రాత్రి నేలపై తల్లి వద్ద నిద్రించిన చిన్నారి ముక్కును ఎలుక కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే గమనించిన తల్లి, కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. దీంతో నిలోఫర్ లో శిశువును చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం చిన్నారి మృతి చెందాడు. శిశువు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని శిశువు కుటుంబ సభ్యులు వాపోయారు. 

కుక్కల దాడిలో బాలుడు 

మరోవైపు, హైదరాబాద్ (Hyderabad) లోనూ కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృత్యువాత పడ్డాడు. షేక్ పేట (Shaikpeta) వినోబానగర్ (Vinobha Nagar) లో అంజి, అనూష దంపతులు  ఈ నెల 8న తమ 5 నెలల బాలుడు శరత్ ను గుడిసెలో ఉంచి కూలీకి వెళ్లారు. ఇంతలో అక్కడికి వచ్చిన కుక్కలు బాలుడిపై తీవ్రంగా దాడి చేశాయి. తల్లిదండ్రులు వచ్చి చూసే సరికి బాలుడు రక్తపు మడుగులో ఏడుస్తూ కనిపించాడు. వెంటనే వారు బాలున్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి నిలోఫర్ కు, ఆపై ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు, స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై కుక్కల దాడి ఘటన సీసీ టీవీల్లో రికార్డైందని పోలీసులు తెలిపారు. అయితే, గతంలోనూ వీధి కుక్కల దాడి ఘటనలు జరిగాయని, కుక్కలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించి తమను కుక్కల బారి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

Also Read: Road Accident News: పొగమంచు కారణంగా తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు- వివిధ ప్రమాదాల్లో ఆరుగురు మృతి

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
Viral Video: అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget